చంద్రబాబు ఎత్తు తగ్గించేస్తాం.. పోలవరానికి కాదు.. జగన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో మంగళవారం.. పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును ఉద్దేశించి.. జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. చంద్రబాబు ఎత్తును తగ్గిచేస్తాం.. కానీ, పోలవరం ఎత్తును మాత్రం తగ్గించేది లేదు! అని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పోలవరం విషయంలో వక్రీకరణ, అబద్దాలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారని జగన్ విమర్శించారు.
తాను విజనరి అని చెప్పుకునే చంద్రబాబు వల్లే ప్రాజెక్టుకు కష్టాలు వచ్చాయని తెలిపారు. కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకున్నారని అన్నారు. 2013-2014 అంచనాల ప్రకారమే ప్రాజెక్టు కడతామని చెప్పారని అన్నారు.
ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నామని చంద్రబాబుకు ఎవరు చెప్పారు? అని జగన్ ప్రశ్నించారు. ప్రధాని మోడీ వీరికి ఏమైనా చెప్పారా? అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గించమని సీఎం జగన్ తెలిపారు.
చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదని అన్నారు. ప్రత్యేక హోదాను తాకుట్టుపెట్టి పోలవరం ప్రాజెక్టును తీసుకున్నారని చెప్పారు. పోలవరం టూర్ పేరుతో రూ.100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని తెలిపారు. పోలవరం వద్ద తన అనుచరులతో చంద్రబాబు భజన చేయించుకున్నారని చెప్పారు.
2023 ఖరీఫ్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం జగన్ తెలిపారు. ఉక్కు సంకల్పంతో పోలవరం నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. కేంద్రం సహకారంతో ఆర్ఆండ్ఆర్ పనులు వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు.
పోలవరం వద్ద వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వైఎస్సార్‌కు అంకితం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును తన తండ్రి వైఎస్సార్ ప్రారంభించారని ఆయన వారసుడిగా కచ్చితంగా ప్రాజెక్టును తాను పూర్తి చేస్తానని సీఎం జగన్ తెలిపారు.