రెడ్డి సామాజిక వ‌ర్గం మంత్రులు వాళ్లేనా?

Update: 2022-03-30 14:30 GMT
ప్ర‌స్తుతం ఏపీ అధికార పార్టీ వైసీపీలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ విష‌యంపై జోరుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రివ‌ర్గాన్ని మారుస్తాన‌ని అధికారం చేప‌ట్టిన‌ప్పుడే సీఎం జ‌గ‌న్ చెప్పారు. ఆ దిశ‌గా ఏప్రిల్ 11న ఆయ‌న కొత్త మంత్రివ‌ర్గాన్ని ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం.

ఇప్ప‌టికే కొత్త మంత్రుల జాబితాను జ‌గ‌న్ ఫైన‌లైజ్ చేశార‌ని టాక్‌. పాత మంత్రివ‌ర్గంలో దాదాపు 90 శాతం మందిపై వేటు ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే కొత్త‌గా ప్ర‌క‌టించే మంత్రుల్లో రెడ్డి సామాజిక వ‌ర్గం కింద ముగ్గురికి మాత్ర‌మే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

కొత్త మంత్రుల జాబితాపై తాడేప‌ల్లి లో స‌మాచారం లీక్ అయిన‌ట్లు తెలుస్తోంది. దాని ప్ర‌కారం కొత్త‌గా రెడ్డి సామాజిక వ‌ర్గంలో ముగ్గురికి మాత్ర‌మే ప‌ద‌వులు ఇస్తున్న‌ట్లు టాక్‌. అందులో ఒక‌రు ఆర్కే రోజా కాగా మిగ‌తా ఇద్ద‌రూ.. రామ‌కృష్ణా రెడ్డి, న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి అని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని జ‌గ‌న్ చూస్తున్నారు. దీంతో ఆయ‌న స్థానంలో రోజాకు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని అంటున్నారు. ఎప్ప‌టి నుంచో జ‌గ‌న్‌కు విధేయురాలిగా ఉన్న ఆమెకు తొలిసారే ఛాన్స్ ఇస్తార‌ని అనుకున్నారు. కానీ వివిధ స‌మీకర‌ణాల‌ను దృష్టిలో పెట్టుకున్న జ‌గ‌న్‌.. రోజాకు ప‌ద‌వి ఇవ్వ‌లేదు.

ఇక ఇప్పుడు క‌చ్చితంగా మ‌హిళ‌ల కోటా చూసుకున్నా రోజా మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఫైర్‌బ్రాండ్ అయిన ఆమెను హోం మంత్రి చేస్తార‌నే ప్ర‌చారం జోరందుకుంది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో లోకేష్ మీద గెలిచిన రామ‌కృష్ణా రెడ్డిపై జ‌గ‌న్‌కు మంచి అభిప్రాయం ఉంది. ఎన్నిక‌ల ప్ర‌చారం స‌మ‌యంలోనే రామ‌కృష్ణ గెలిస్తే మంత్రిని చేస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని జ‌గ‌న్ నిల‌బెట్టుకోబోతున్నార‌ని చెబుతున్నారు.

ఇక మ‌రోవైపు ఇటీవ‌ల మృతి చెందిన మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి స్థానంలో అదే జిల్లాకు చెందిన న‌ల్ల‌పురెడ్డి ప్ర‌సన్న‌కుమార్ రెడ్డికి ఛాన్స్ ద‌క్కే ఆస్కార‌ముంది. జ‌గ‌న్‌కు న‌మ్మ‌క‌స్తుడిగా పేరున్న ప్ర‌సన్న‌కు మంత్రి ప‌దవి క‌న్‌ఫార్మ్ అని ఆయ‌న అనుచ‌రులు చెప్పుకుంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ప్ర‌క‌టించే మంత్రివ‌ర్గంలో వీళ్ల‌కు అవ‌కాశం ద‌క్కుతుందా? లేదా ఏమైనా మార్పులు ఉంటాయా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News