పొత్తులే జనసేనకు కీలకం.. పవన్ ఏం చేయనున్నారు.?

Update: 2022-03-14 06:30 GMT
జనసేన ఆవిర్భావ సభ కోసం జనసైనికులే కాదు.. ప్రతిపక్షాలు, ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీ రాజకీయాల భవిష్యత్ ను దిశానిర్ధేశం చేసే కీలకమైన పొత్తులపై పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రకటిస్తారని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. వచ్చే ఎన్నికల పొత్తులపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇస్తారని.. జనసేన పార్టీ పోరాట కార్యాచరణను ప్రకటిస్తారని అంటున్నారు.

బలమైన వైసీపీని ఓడించాలంటే ఒంటరిగా వెళితే టీడీపీకి, జనసేనకు కూడా నష్టమే. అందుకే జనసేన ఇప్పుడు టీడీపీకి, వైసీపీకి అత్యంత కీలకం. వైసీపీ ఎలాగూ కలవదు..టీడీపీకే చాన్స్. ఓట్లు చీలేలా జనసేన చేస్తుంది. ఆ పార్టీ ఒంటరిగా లేదా బీజేపీతో కలిసి పోటీ చేస్తే వైసీపీకే లాభం. టీడీపీ మళ్లీ ఓడిపోతుంది. జనసేనతో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి లాభం. ఒకవేళ జనసేన విడిగా పోటీచేస్తే టీడీపీకి ఓటమి ఖాయం. అందుకే వైసీపీ సైతం ఈ పొత్తు రాజకీయాలపై ఆసక్తిగా చూస్తోంది.

టీడీపీ నేతలు అందుకే జనసేనతో పొత్తుకు ఉబలాటపడుతున్నారు. ఆ పార్టీతో కలిసి పోటీచేయడం వల్ల టు ఏపీలో అధికారం సాధ్యమవుతుందని నమ్ముతున్నారు. మిత్రపక్షం బీజేపీ కూడా పొత్తులపై ఇంత పట్టుదల ప్రదర్శించకపోయినా టీడీపీ నేతలు మాత్రం పదే పదే పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పొత్తుల కోసం అర్రులు చాస్తున్నారు. జనసేనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు.

నిజానికి ఇప్పటికే జనసేన కింది స్తాయి నేతలు టీడీపీతో కలిసిపోయారు. స్థానిక ఎన్నికల్లో అలానే చేసి గెలిచారు కూడా. ఒక బీజేపీతో కలిసి పోటీచేయడం వల్ల జనసేనకు ఒక్క ఓటు రాకపోగా.. మైనార్టీ, క్రిస్టియన్ ఓట్లు కూడా జనసేనకు దూరం అవుతున్నాయి. ఇదే జనసేనకు పెద్ద మైనస్ గా మారింది. దీనిపై అనేక మంది కీలక నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల కాలంలో బీజేపీకి దూరం పాటిస్తున్నారు. వారితో కలవడానికి ఇష్టపడడం లేదు.

ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ పొత్తులపై నేడు కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. ఈసారి పొత్తులేవి లేకుండా ఒంటరిగా పోటీచేయడమో లేకపోతే ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకుందామా? అన్న చర్చ కూడా జరిగే అవకాశం ఉంది.

ఇక బీజేపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ కూడా అంత అసంతృప్తిగా ఉన్నారని టాక్ నడుస్తోంది. ఆ పార్టీకి దూరంగా ఒంటరిగా అడుగులు వేసేందుకే పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకూ ఏపీ రాజకీయాల్లో వర్కవుట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News