రోడ్ మ్యాప్! జనసేన రోడ్ మ్యాప్!! ఇదీ ... ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. తాజాగా జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. పార్టీ ని గద్దె దించి తాము రావడమే ముఖ్యమన్నారు. అయితే.. దీని కి సంబంధించి బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వాల్సి ఉందని.. తర్వాత.. దానిని చూసి.. తాను నిర్ణయం తీసుకుం టానని చెప్పారు. అయితే.. జనసేనకు బీజేపీ ఇంకా.. రోడ్ మ్యాప్ ఇవ్వలేదు.
ఈ విషయం.. పవనే స్పష్టం చేశారు. త్వరలోనే బీజేపీ రోడ్ మ్యాప్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే.. ఈ రోడ్ మ్యాప్ కూడా కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఇవ్వాలా.. లేక రాష్ట్రంలోని బీజేపీ నాయకులు ఇవ్వాలా? అనేది చర్చగా మారింది.
అయితే.. బీజేపీ రోడ్ మ్యాప్ ఎలా ఉన్నప్పటికీ.. ఆ పార్టీకే ప్రధాన తాంబూలం దక్కుతుంది. బీజేపీకే ఎక్కువ స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది. కానీ, బీజేపీకి రాష్ట్రంలో ఒక శాతం కూడా ఓటు బ్యాంకు లేదు. సో.. వాళ్లకు 5 సీట్లు ఇచ్చినా ఎక్కువే అనే టాక్ ఉంది.
అంతేకాదు.. బీజేపీ ఎక్కడ గెలిచినా.. అది జనసేన ప్రభావంతోనే అయి ఉంటుందని.. చెబుతున్నారు. దీంతో చివరకు ఈ రోడ్ మ్యాప్ ఇచ్చేది బీజేపీ కాదు.. టీడీపీనేనని అంటున్నారు పరిశీలకులు. ఈ లెక్కన చూస్తే.. చంద్రబాబు ఇచ్చే రోడ్ మ్యాపే జనసేనకు ఫైనల్ కానుందనే టాక్ వినిపిస్తోంది.
చంద్రబాబు లెక్కల ప్రకారం.. టీడీపీ 135 స్థానాలు అట్టిపెట్టుకుని... జనసేన 30 స్థానాలు.. బీజేపీ 10 స్థానాలకు పరిమితం కావొచ్చు. ఇంతకంటే.. రోడ్ మ్యాప్ ఇంకేముంటుందని అంటున్నారు పరిశీలకులు.
ఇక, ప్రచారంలో ఎవరు గెలిచినా.. సీట్లు మాత్రం.. జనసేన తీసుకుంటుందని తెలుస్తోంది. అదేవిధంగా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా జనసేన పోటీ చేస్తుందని.. అంటున్నారు. మొత్తం గా చూసుకుంటే.. బీజేపీ కన్నా కూడా.. టీడీపీఇచ్చే రోడ్ మ్యాపేఫైనల్ అని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.