టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ పుట్టినరోజు ఎంత ఘనంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక భారీ చిత్రాన్ని లాంచ్ చేసే ముందు ఒక పద్ధతి ప్రకారం కార్యక్రమాల్ని నిర్వహించటం ద్వారా.. సదరు చిత్రం గురించి అందరూ మాట్లాడుకునే బజ్ ను ఎలా క్రియేట్ చేశారో.. ఈసారి గులాబీ బాస్ పుట్టిన రోజును రోటీన్ కు భిన్నంగా రెండు రోజుల ముందు నుంచే వేడుకలు నిర్వహించటం ద్వారా.. కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలు తమకెంత ముఖ్యమైనవన్న విషయాన్ని చెప్పేశారు మంత్రి కేటీఆర్.
వారు అనుకున్నట్లే.. ధూంధాం అన్న రీతిలో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. రాష్ట్రపతి.. ప్రధాని మొదలుకొని ప్రత్యర్థులతో పాటు కొత్త.. పాత స్నేహితులు అందరూ సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు పోటాపోటీ పడ్డారు.
ప్రధానమంత్రి మోడీ అయితే ఏకంగా ఫోన్ చేసి మరీ శుభాకాంక్షలు చెప్పటం అందరిని ఆకర్షించటమే కాదు.. రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చగా మారింది. జాతీయ రాజకీయాలకు వెళ్లాలనుకుంటున్న వేళలో వచ్చిన పుట్టినరోజు వేడుకల్ని జాతీయ స్థాయిలో మాట్లాడుకునేలా చేయాలన్న గులాబీ బాస్ వ్యూహంలో ఎవరికి వారు తమ వంతు పాత్రను పోషించారని చెప్పాలి.
విమర్శల్ని పట్టించుకోకుండా అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్ని మూడు రోజులు నిర్వహించాలంటూ మంత్రి కేటీఆర్ ప్రకటన.. పార్టీ నేతలకు.. కార్యకర్తలకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందని చెప్పాలి.
ఈ పుట్టినరోజు ఎంత ముఖ్యమన్న విషయాన్ని చాటి చెప్పటం.. దీనికి తగ్గట్లే రియాక్టు అయిన గులాబీ దళం.. ధూంధాం అన్న రీతిలో పుట్టిన రోజు వేడుకల్ని నిర్వహించారు. కొత్త మిత్రులతో జట్టు కట్టే వేళలో.. అందుకు తగ్గ బ్యాంగ్ ఉండాలని ఆశించే కేసీఆర్ కు ఆయన కోరుకున్నట్లే బర్త్ డే వేడుకలు సాగటం చూసినప్పుడు.. కేసీఆర్ వ్యూహరచన ఎంత పకడ్బందీగా ఉంటుందన్నది మరోసారి స్పష్టం చేశారని చెప్పాలి.