గత కొద్దికాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామికి మధ్య పొరాపొచ్చాలు వచ్చాయని జరుగుతున్న ప్రచారం నిజమయ్యే పరిణామం ఒకటి తెరమీదకు వచ్చింది. సమతామూర్తి విగ్రహం ప్రారంభోత్సవం సమయంలో బయటపడ్డ విబేధాల ప్రచారం వాస్తవమేనన్నట్లుగా యాదాద్రి ప్రారంభోత్సవ కార్యక్రమ ఘట్టాల్లో చినజీయర్‌కు సర్కారు షాక్ ఇచ్చింది. యాదాద్రి ప్రారంభానికి చినజీయర్ కు పిలుపు అందలేదు. ఆలయ ప్రారంభానికి సంబంధించి విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేరు ఎక్కడా లేదు.
ఈ నెల 21 నుంచి 28 వరకు మహాకుంభ సంప్రోక్షణ పూజల్లో భాగంగా బాలాలయంలో ఆంతరంగికంగా పంచకుండాత్మక మహా సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఆలయ ప్రారంభ ఏర్పాట్లపై గురువారం యాదాద్రిలో అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ప్రకటన విడుదల చేశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొనగా, అందులోనూ చినజీయర్ పేరు లేదు. ఈ యాగంలో 108 మంది పారాయణికులు, ఆలయ వేద పండితులు పాల్గొంటారని కలెక్టర్ వెల్లడించారు. చినజీయర్ పెట్టిన ముహూర్తానికే పూజలు జరుగుతాయని పేర్కొన్నారే తప్ప.. ఆయన ఆధ్వర్యంలో జరుగుతాయని మాత్రం చెప్పలేదు. పైగా ఆలయాన్ని తామే ప్రారంభిస్తామని స్థానిక అర్చకులు మీడియాతో చెప్పడం గమనార్హం. తాజా పరిణామాలతో జీయర్ స్వామి విషయంలో ప్రభుత్వం `వైఖరి` స్పష్టమైందని పలువురు చర్చించుకుంటున్నారు.
కాగా, ఇప్పటికే చినజీయర్ స్వామి వార్తల్లో వ్యక్తిగా ఉన్న సంగతి తెలిసిందే. సమతామూర్తి విగ్రహం ఏర్పాటు సమయంలో విబేధాలు వచ్చాయన్న వార్తలు సద్దుమణిగిన సమయంలోనే... తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద.. చిన్న జీయర్ స్వామి చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. ఆదివాసి, తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీలు జీయర్ కామెంట్లపై భగ్గుమన్నారు. చినజీయర్ అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సమతామూర్తి పేరుతో 120 కిలోల బంగారు విగ్రహం పెట్టి.. అది చూడటానికి కూడా రూ.150 టికెట్ పెట్టి మీరు వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. సమతామూర్తి పేరుతో ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని అన్నారు. మా తల్లుల దగ్గర ఎటువంటి టికెట్ లేదు అని, సమ్మక్క సారలమ్మ దగ్గర ఎలాంటి వ్యాపారం జరగదని ఆమె నొక్కివక్కానించారు.