చెప్పిన మాటల్ని చెప్పటం తప్పేం కాదు. కానీ.. విజయవంతమైన ఒక సినిమా పోలిన సినిమానే మళ్లీ తీస్తే ఎలా ఉంటుంది. ఒకే తరహా డైలాగుల్ని ఒకే హీరో చేత చెప్పిస్తే ఎలా ఉంటుంది? వినేందుకు విసుగ్గా ఉంటుంది కదా? ఇప్పుడు అలాంటి తీరునే ప్రదర్శిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తానంటూ ఆయన అధికారంలోకి రావటం తెలిసిందే. గడిచిన ఏడున్నరేళ్లలో తెలంగాణ బంగారు తెలంగాణగా ఎంత మారిందన్న దానిపై చర్చ కంటే కూడా తెలంగాణ వాసులకు.. తెలంగాణ కోసం తపించిన వారందరికి ఇప్పుడు అర్థమవుతూనే ఉంది.
ఇలాంటి వేళలో బంగారు తెలంగాణను గుర్తు చేస్తూ.. బంగారు భారత్ ను నిర్మిస్తామన్న కేసీఆర్ మాటలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు వలస వెళ్లే తీరును తప్పు పట్టిన కేసీఆర్.. తిరిగి తెలంగాణకు తీసుకొస్తున్నామని చెప్పటం తెలిసిందే. ఇదే విషయాన్ని గుర్తు చేసేలా.. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న ఆయన.. భారత్ నుంచి అమెరికాకు వెళ్లటం కాదు.. అమెరికా నుంచి భారత్ కు తిరిగి వచ్చేలా చేస్తామన్న మాటలు బీరాలు పలికేలా ఉంటాయే తప్పించి మరింకేమీ కాదని చెప్పాలి.
ఎక్కడి దాకానో ఎందుకు? అమెరికాలో స్థిరపడి.. టీఆర్ఎస్ పార్టీని అమితంగా మోసే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని.. ఈ రోజున తెలంగాణకు రమ్మని పిలిస్తే ఎంతమంది వస్తారు?
అసలు అది సాధ్యమా? భారత్ ను అమెరికాను పోల్చుడు సరైన పద్ధతేనా? హైదరాబాద్ ను ఇస్తాంబుల్ చేస్తానని.. లండన్ నగరంగా మారుస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు ఆ ఊసునే మర్చిపోయిన వైనాన్ని మర్చిపోలేం. ఇవాల్టికి.. హైదరాబాద్ లో జోరు వాన పడితే.. మహానగరం మొత్తం స్తంభించిపోయే పరిస్థితి. మహానగర ప్రజలు ఆగమాగం అయిపోతున్నారు. అసాధ్యమైన కరెంటు ఇష్యూను క్లోజ్ చేసానని చెప్పే కేసీఆర్.. హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ సమస్యను.. వర్షాలు పడినప్పుడు రోడ్లు మీద జాం అయ్యే దుస్థితిని ఎందుకు అధిగమించలేకపోయారు? అన్నది ప్రశ్న.
అందుకే తెలంగాణలో హిట్ అయిన మాటలకు భారత్ అంటూ కాపీ కట్ పేస్ట్ చేసి మాటలు చెబితే.. బొమ్మ హిట్ సంగతి తర్వాత.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు వైఫల్యాలన్ని కళ్ల ముందు కదలాడటం ఖాయం. ఇకనైనా.. కాపీ కట్ పేస్టు మాటల్ని వదిలేస్తే మంచిది. మరి.. ఈ విషయాన్ని కేసీఆర్ గుర్తిస్తారంటారా?