మోడీని వద్దంటూనే.. ఆయన బాటలో ఈ ఊరింపులేంది కేసీఆర్?

Update: 2022-03-09 03:27 GMT
ఒకరిని పూర్తిగా తప్పు అన్నప్పుడు.. సదరు వ్యక్తి మాటల్ని.. చేతల్ని అస్సలు ఫాలో కాకూడదు కదా? అందులోని వేలాది పుస్తకాలు చదివిన టీఆర్ఎస్ అధినేత కమ్ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వాళ్లకు.. వారిదంటూ ఒక సిగ్నేచర్ ఉండాలి కదా? ఏదైనా కీలక ప్రకటనను వెలువరించే వేళలో.. ఇంకేం ఉంది.. కొన్ని గంటల్లో బ్రహ్మండం బద్ధలవుతుందంటూ ఊరించి..

తాను చెప్పాలనుకున్న విషయాలనికి విపరీతమైన బిల్డప్ ఇచ్చే అలవాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎంత ఎక్కువన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.మోడీని.. ఆయన విధానాల్ని తప్పు పట్టే వారు.. ఆయన బాటలో నడవటంలో అర్థం లేదు. ఎప్పుడూ లేనిది.. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఊరింపు మామూలుగా లేదు.

బుధవారం ఉదయం 10 గంటలకు టీవీలు చూడండి.. నిరుద్యోగుల కోసం ప్రకటన చేస్తానంటూ ఆయన చెప్పిన మాట హాట్ టాపిక్ గా మారి.. ఆయన నోటి నుంచి ఏం వస్తుందన్న విషయంపై మంగళవారం మధ్యాహ్నం నుంచే చర్చ మొదలైంది.

కొందరు 50వేల ఉద్యోగాలకు సంబంధించిన చారిత్రక ప్రకటన చేస్తారని చెబుతుంటే.. మరికొందరు గతంలో ఇచ్చిన నిరుద్యోగ భ్రతి వరానికి సంబంధించిన కీలక ప్రకటన చేస్తారంటున్నారు. కేసీఆర్ నోటి నుంచి మాట ఏదైనా కావొచ్చు. కానీ.. ఈ ఊరింపులకు మూలం మోడీనే. ఆయన్ను.

ఆయన విధానాల్ని తీవ్రంగా తప్పు పట్టే కేసీఆర్.. ఆయన నడిచే మార్గంలో కాకుండా మరోలా ప్రయత్నించి ఉండొచ్చు కదా? ఆ పని ఆయన ఎందుకు చేయనట్లు? అన్నది ప్రశ్న.

తెలంగాణ అసెంబ్లీలో బుధవారం ఉదయం పది గంటల వేళలో తానో ప్రకటన చేస్తానని.. ఆ టైంలో అందరూ టీవీలు చూడాలని కోరుతున్న కేసీఆర్ మాటల్ని చూస్తుంటే.. ఈ కొత్త తరహా ఊరింపు వ్యూహాం ఎంతమేరకు పని చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రోటీన్ కు భిన్నంగా.. తన మార్కును చూపించాల్సిన కేసీఆర్.. తిరిగి తిరిగి నమోను గుర్తు చేసేలా వ్యాఖ్యలు చేయటం ఆయనకు ఎంతమేరకు మేలు చేస్తుందో కాలమే సరైన సమాధానం చెప్పగలదు.
Tags:    

Similar News