ఉగాదికి మరి కొద్ది రోజులు ముందు.. కొలువుల ఉగాదిని ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగానూ.. హాట్ టాపిక్ గా మారింది. కొత్త ఆశల్ని మోసుకొచ్చే ఈ కొలువుల ఉగాదిలో తీపి మాత్రమేనా..? చేదు.. పులుపు..కారం లాంటి రుచులు కూడా ఉన్నాయా? అన్నది ప్రశ్న. గడిచిన ఎనిమిదేళ్లుగా కేసీఆర్ పాలనను.. ఆయన మాటల్ని.. చేతల్ని చూసే వారికి.. తాజాగా కొలువుల జాతర వెనుక పక్కా వ్యూహం ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
కేసీఆర్ ప్రకటన వెలువడిన వెంటనే.. ఆయన ఫోటోలకు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాలాభిషేకాల్ని చేపట్టిన వైనం చూస్తే.. వేలాది లీటర్ల పాలు వేస్టు చేసే కన్నా.. పేదలకు పంచి పెట్టొచ్చు కదా? అన్న భావన కలగటం ఖాయం.
కొలువుల ఉగాదిని చూస్తే.. తీపి అంశంగా 91 వేల పోస్టుల్ని భర్తీ చేయటం.. అందుకు తగ్గట్లు నోటిఫికేషన్లు జారీ చేయటంగా చెప్పొచ్చు. మరి.. కారం.. పులుపు.. చేదు విషయానికి వస్తే.. అందుకు కొదవ లేదన్న మాట వినిపిస్తోంది. ఉదాహరణకు తాజా ఉద్యోగ భర్తీ విషయానికి వస్తే ఓసీలకు 44.. ఎస్సీ.. ఎస్టీ.. బీసీలకు 49 ఏళ్లు.. దివ్యాంగులకు 54 ఏళ్లుగా చేస్తున్నట్లు చెప్పారు.
ఇదంతా చూస్తే.. 54 ఏళ్ల వయసులో ఉద్యోగాన్ని సాధించిన వారు.. తమ సర్వీసును ఎంతకాలం చేపడతారు? అంటే.. అంత వయసు వారు కూడా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారంటేనే.. తెలంగాణలో నిరుద్యోగ పరిస్థితి ఎలా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
అదే సమయంలో 54 ఏళ్ల వయస్కులు సైతం ఉద్యోగాల కోసం రేసులోకి దిగితే.. లాభం జరిగేది ఎవరికి? నష్టంవాటిల్లేది ఎవరికి? అన్నది మరో ప్రశ్న. అటెండరు నుంచి ఆర్డీవో వరకు ఉద్యోగాల్లో 95 శాతం రిజర్వేషన్లు స్థానికులకే లభిస్తాయని చెప్పిన కేసీఆర్.. మిగిలిన 5 శాతం ఓపెన్ కోటా అని చెబుతూనే.. అందులోనూ ఎక్కువమంది తెలంగాణ వారికే అవకాశం పొందుతారని చెప్పటం గమనార్హం.
కొత్తగా ఉద్యోగాల భర్తీ కారణంగా ప్రభుత్వ ఖజానాపై రూ.7వేల కోట్ల భారం పడుతుందన్న కేసీఆర్.. వేలాది కోట్లను ఖర్చు చేసే కొత్త పథకాల్ని తెర మీదకు తెచ్చే ఆయన.. ఉద్యోగాల భర్తీని ఇంతకాలం ఎందుకు చేయనట్లు? అన్నది మరో ప్రశ్నగా మారింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు 1.91లక్షలు అయితే..అందులో 91 వేల పోస్టుల్నిమాత్రమే భర్తీ చేస్తామని చెప్పటం ఏమిటి? మిగిలిన లక్ష మాటేమిటి? అని ప్రశ్నిస్తున్నారు.
అన్నింటికి మించి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు ప్రకటించిన కేసీఆర్.. ఈ మొత్తం ప్రక్రియను ఎప్పటిలోపు పూర్తి చేస్తామన్న మాటను చెప్పలేదు. దీన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.