అన్ని రంగాల్లో అనిశ్చితి ఉంటుంది. మిగిలిన వాటితో పోలిస్తే రాజకీయ రంగంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రంగంలో టైంకు.. టైమింగ్ కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదనే చెప్పాలి. రెండు రోజుల క్రితం వరకు ఉన్న పరిస్థితి ఏమిటి? ఈ రోజు పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు సమాధానమే దీనికి నిదర్శనంగా చెప్పాలి. యూపీలో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగలనుందని.. సమాజ్ వాదీ పార్టీ పుంజుకోవటంతో పాటు.. అందరికి షాకిచ్చే ఫలితాలు వెల్లడవుతాయన్న అంచనాల్ని కొందరు వేశారు. అలాంటి అంచనాల్లో ఉన్న వారిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరు.
అందుకు భిన్నంగా యూపీ మాత్రమే కాదు మరో మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ బలం ఏమిటన్న విషయం అర్థం కావటమే కాదు.. సమీప భవిష్యత్తులో బీజేపీని ఎదుర్కోవటం.. మోడీ పరివార్ తో పెట్టుకోవటం సరికాదన్నది గురువారం వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయనే చెప్పాలి.
జాతీయ స్థాయిలో మోడీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని.. ఆయనకు.. ఆయన పార్టీకి ఎదురుగాలి మొదలైందని.. ఇలాంటివేళలో మోడీకి ప్రత్యామ్నాయంగా కూటమిని సిద్ధం చేస్తే.. రాజకీయ శక్తిగా మారుతుందన్న మాట బలంగా వినిపించింది. ఆ మాటకు వస్తే.. ఇదే ఎజెండాతో ఇప్పటికే మహారాష్ట్రతో పాటు.. ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ కొందరునేతల్ని తన వద్దకు పిలిపించుకొని మరీ చర్చించుకోవటం తెలిసిందే.
అయితే.. కేసీఆర్ అంచనాలు ఒకలా ఉంటే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరోలా ఉండటమే కాదు.. కొత్త అంశాల్ని మోడీ ప్రత్యర్థులకు అర్థమయ్యేలా చేసిందని చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల ముందు వరకు కమలనాథుల్ని ఫ్లవర్ అనుకున్న కేసీఆర్ కు తాజా ఎన్నికల ఫలితాల్ని చూసినప్పుడు అర్థమైందేమిటంటే.. ‘ఫైర్’ అన్న విషయం.
ఈ వాస్తవాన్ని కేసీఆరర్ జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు.సాధారణంగా రాజకీయ విశ్లేషణలతో పాటు.. ఎన్నికల ఫలితాల అంచనాల విషయంలో కేసీఆర్ కు ప్రత్యేక శైలి ఉందని చెబుతారు. ఆయన అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. అందుకు భిన్నంగా యూపీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కావటం కేసీఆర్ కు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
ఇప్పటిదాకా ఫ్లవర్ అనుకున్న కమలం ఫైర్ అన్న విషయం అర్థమయ్యాక గులాబీ బాస్ ఎత్తులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరమని చెప్పక తప్పదు.