విజయానికి.. అపజయానికి మధ్య తేడా చాలా సున్నితంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో విజయం సాధించినట్లు కనిపిస్తుంటుంది కానీ.. అదేమాత్రం గెలుపుకాదన్న విషయం కాస్తంత ఆగితే కానీ అర్థం కాదు. అదే సమయంలో అపజయంతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి.. వైఫల్యాలకు కుంగిపోకుండా కసిగా పని చేస్తే.. లోకేశ్ మాదిరి మారతారన్న భావన వ్యక్తమవుతోంది. తన తండ్రి కమ్ పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో.. మంత్రిగా వ్యవహరించిన లోకేశ్ మైకు పట్టుకుంటే టీడీపీ శ్రేణులు వణికిపోయేవి. ఆయన ఎలా మాట్లాడతారో అన్న సందేహాలు వ్యక్తమయ్యేవి.
అందుకు తగ్గట్లే.. ఆయన మాట్లాడిన మాటల్లో దొర్లే తప్పుల్ని హైలెట్ చేస్తూ చిట్టి వీడియోలు.. మీమ్ లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ కావటమే కాదు.. దాన్నో పెద్ద ఇష్యూలా చేయటంతోపాటు.. లోకేశ్ సమర్థత మీద కొత్త సందేహాలు కలిగే ప్రచారం నడిచేది. దీనికి తగ్గట్లు ఆయన రూపం కూడా వేలెత్తి చూపేలా ఉండేది. కరోనా నేపథ్యంలో తనను తాను మార్చుకునేందుకు లోకేశ్ చేసిన ప్రయత్నాలు ఫెయిల్ కాలేదన్న విషయం ఆయన రూపంలో వచ్చిన మార్పు ఇట్టే చెప్పేసే పరిస్థితి.
తనను వేలెత్తి చూపించే రూపంలోనూ.. తన మాటల్లోనూ.. వాచకంలోనూ మార్పులు చేసుకున్న ఆయన.. తనను తాను సరి దిద్దుకోవటానికి ఎంతగా శ్రమించారన్నది ఆయన్ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాలు.. నిర్వహించిన ప్రోగ్రాంలు పార్టీలో కొత్త జోష్ ను తీసుకొచ్చాయని చెప్పాలి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నిర్వహించిన బైక్ ర్యాలీలో.. పార్టీ కార్యకర్తలతో కలిసి బుల్లెట్ వాహనాన్ని నడిపారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా తమ రాజకీయ ప్రతర్థిపై విరుచుకుపడే తీరులో మారిన తనను చక్కగా చూపించుకున్నారు లోకేశ్.
ఇంతకూ సభలో ఏం మాట్లాడారు? అన్న విషయాన్ని చూస్తే.. ఏపీ అధికారపార్టీ తీరును తీవ్రంగా తిట్టి పోసిన ఆయన.. పర్టీ గురించి గొప్పగా చెప్పుకున్నారు. లోకేశ్ తాజా ప్రసంగాన్ని చూస్తే.. మారిన మనిషి అన్న విషయాన్ని స్పష్టంగా తెలిసేలా ఆయన మాటలు ఉన్నాయని చెప్పాలి. ఇదే.. రాజకీయ వర్గాల్లోనూ లోకేశ్ వ్యాఖ్యలు ఆసక్తికర చర్చగా మార్చాయని చెప్పాలి. ఇంతకూ లోకేశ్ ఏం మాట్లాడారన్నది చూస్తే..
- రికార్డుల్ని క్రియేట్ చేయాలన్నా.. వాటిని తిరిగి రాయాలన్నా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. తెలుగుదేశం పార్టీ ఆన్ స్టాపబుల్ ప్రజల పార్టీ. జగన్ రెడ్డిది గాలి పార్టీ. ఎన్నికలకు మరో రెండేళ్లే ఉంది. నాయకులు.. కార్యకర్తలు ప్రజల మధ్యలోనే ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం క్రషి చేయాలి.
- తెలుగుదేశం కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టిన అధికారులకు.. వైసీపీ నేతలకు సినిమా మొదలవుతుంది. ఎవరిని విడిచి పెట్టేది లేదు. అమెరికాకు వెళ్లినా.. ఐవరీ కోస్టుకు వెళ్లినా ఎవరిని వదిలేది లేదు. నా తల్లిని బాధించిన వారెవరినీ విడిచిపెట్టేది లేదు.
- నాపై హత్యాయత్నంతో పాటు 11 అక్రమ కేసులు పెట్టారు.దేనికి భయపడేది లేదు. కార్యకర్తలు తెగించి కొట్లాడాలి. ముల్లును ముల్లుతోనే తీయాలి.
- రాష్ట్ర విభజన తర్వాత బంగారు బాతు లాంటి హైదరాబాద్ ను మనం కోల్పోయాం. హైదరాబాద్ కు ధీటైన నగరాన్ని నిర్మించాలని అమరావతిని ప్రారంభించాం. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అన్నది తెలుగుదేశం నినాదం. రాష్ట్రానికి కంపెనీలు తెచ్చి.. ఉద్యోగాలు ఇచ్చింది టీడీపీ. కంపెనీలను పక్క రాష్ట్రాలకు తరిమేసి యువతను నిరుద్యోగులుగా మారుస్తోంది జగన్ రెడ్డి పార్టీ.