ప్రపంచ వ్యాప్తంగా ఒక ఊపు ఊపేసిన పెగాసన్ సాఫ్ట్ వేర్ కు సంబంధించి ఇష్యూ.. మన దేశాన్ని చుట్టుముట్టటం.. ఈ ఎపిసోడ్ లో మోడీ సర్కారు మీద పెద్ద ఎత్తున ఆరోపణలు.. విమర్శలు రావటం తెలిసిందే. ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్ కు గురయ్యాయని.. అందుకు పెగాసన్ సాఫ్ట్ వేర్ ను కేంద్రంలోని మోడీ సర్కారు వినియోగించిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం తెలిసిందే. అయితే.. వీటిని మోడీ సర్కారు తీవ్రంగా ఖండించింది. ఇదిలా ఉంటే.. పెగాసన్ సాఫ్ట్ వేర్ వినియోగానికి సంబంధించిన తన వద్దకు వచ్చిన డీల్ గురించి వెల్లడించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెను సంచలనానికి తెర తీశారు.
తాజాగా పెగాసన్ సాఫ్ట్ వేర్ గురించి మాట్లాడిన సీఎం మమతా.. తనకు కొన్నేళ్ల క్రితమే ఈ సాఫ్ట్ వేర్ ను కొనుగోలుకు సంబంధించిన ఆఫర్ వచ్చినట్లుగా పేర్కొన్నారు. అయితే.. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి వాటిని కొనుగోలు చేయటానికి తాను వ్యతిరేకమన్న ఆమె.. పెగాసన్ సాఫ్ట్ వేర్ కొనుగోలు ఉన్న అవకాశాలు ఎంత ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని ఆమె చెప్పేశారని చెప్పాలి.
ఇప్పటికే తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందన్న విషయానికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం మాట్లాడిన ఆమె.. పెగాసన్ సాఫ్ట్ వేర్ కు సంబంధించి మరింత సమాచారాన్ని ఆమె వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం తన వద్దకు పెగాసన్ సాఫ్ట్ వేర్ కు సంబంధించిన డీల్ కోసం.. సదరు సంస్థ ప్రతినిధులు తమ పోలీసు డిపార్ట్ మెంట్ ను సంప్రదించారన్నారు.
తమ సాఫ్ట్ వేర్ వినియోగానికి రూ.25 కోట్ల మొత్తాన్ని డిమాండ్ చేసినట్లుగా చెప్పిన సీఎం మమత.. తమకు అలాంటి సాంకేతికత వద్దని రిజెక్టు చేసినట్లు చెప్పారు.
సంఘ విద్రోహులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించటానికైతే ఫర్లేదు కానీ.. రాజకీయం కోసం.. అధికారులు.. న్యాయమూర్తుల మీద ఉపయోగించటం తనకు ఇష్టం లేదన్నారు. దీదీ వెల్లడించిన వివరాల నేపథ్యంలో పెగాసన్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసే అవకాశం ఎవరికైనా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. అంటే.. ఇప్పటికే మోడీ అండ్ కో మీద ఉన్న పెగాసన్ ఆరోపణలు.. ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ మీద వచ్చిన వార్తల్లో నిజం ఉందా? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
ఈ ఉదంతం పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏమైనా.. పెగాసన్ సాఫ్ట్ వేర్ వ్యవహారం రానున్న రోజుల్లో పెను సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందన్న మాట వినిపిస్తోంది.