పార్టీలకన్నా అభ్యర్ధులే ఇక్కడ కీలకమా ?

Update: 2022-02-28 04:21 GMT
మణిపూర్ ఎన్నికల్లో విచిత్రమైన పరిస్దితులు కనబడుతున్నాయి. ఇక్కడ పార్టీలకన్నా అభ్యర్ధుల బ్యాక్ గ్రౌండే కీలకంగా చూస్తారట ఓటర్లు. ఎంతపెద్ద పార్టీ తరపున పోటీచేస్తున్నా అభ్యర్ధి గుణగణాలు సరిగా లేకపోతే ఆ అభ్యర్ధి కచ్చితంగా ఓడిపోతారనేందుకు గతంలో చాలా ఉదాహరణలే ఉన్నాయి. అలాగే పోటీలో ఉన్న అభ్యర్ధికి మంచి పేరుంటే పార్టీలతో సంబంధం లేకుండానే గెలిపించిన ఘటనలు కూడా ఉన్నాయి.

 అందుకనే చాలాపార్టీలు తమ అభ్యర్ధుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటాయి. మణిపూర్లోని 60 స్ధానాలకు జరగాల్సిన పోలింగ్ లో సోమవారం మొదటివిడత పోలింగ్ మొదలైంది.  బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్), జనతాదళ్ యునైటెడ్ (జేడీయు)పార్టీలతో పాటు కొందరు ఇండిపెండెంట్ అభ్యర్ధులు కూడా పోటీచేస్తున్నారు. విచిత్రమేమిటంటే పోటీలో ఉన్న అన్నీపార్టీలు గెలుపు తమదే అని చెప్పుకుంటున్నాయి.

 దీనికి ప్రధాన కారణం ఏమిటంటే తాము నిలబెట్టిన అభ్యర్ధుల విజయమే తమ పార్టీని అధికారంలోకి వచ్చేట్లు చేస్తుందని పార్టీల అధినేతలు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. ఈ కారణంగానే అన్నీ పార్టీలు అభ్యర్ధుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్నాయట. బీజేపీ 60 సీట్లకూ పోటీచేస్తోంది. కాంగ్రెస్ 54 సీట్లకు, జేడీయు 38, ఎన్పీపీ 42, ఎన్పీఎఫ్ 10 చోట్ల పోటీచేస్తున్నాయి. శివశేన, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, ఎన్సీపీ లాంటి పార్టీలు కూడా కొన్ని చోట్ల పోటీ చేస్తున్నాయి.

జాతయ పార్టీల అభ్యర్ధులను కాదని గతంలో ఇండిపెండెంట్ అభ్యర్ధులను కూడా గెలిపించిన ఘటలున్నాయి. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ గతంలో అంటే 2017లో బీజేపీ తరపున పోటీచేసి గెలిచారు. అంతకుముందు 2007, 2012లో కాంగ్రెస్ తరపున గెలిచారు. అంతకన్నా ముందు 2002లో డీఆర్పీపీ తరపున పోటీచేసి గెలిచారు. అంటే మణిపూర్ ఓటర్లకు అభ్యర్ధులే ముఖ్యంకానీ పార్టీలు కాదని అర్ధమవుతోంది. అందుకనే పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసి రాజీనామా చేసిన  ఓ యువతి ఇండిపెండెంట్ గా పోటీలోకి దిగింది. ఈమెకు మణిపూర్ ఉక్కుమహిళా పేరుంది. మరీమె భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి.

 

 

    
    
    

Tags:    

Similar News