ఆమె తల్లి జయలలిత.. తండ్రి శోభన్ బాబునట

Update: 2022-03-17 05:27 GMT
తమిళనాడులోని అధికారులకు మీనాక్షి పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. ఆమె నుంచి తమను కాపాడే వారు ఎవరని ఆశగా చూస్తున్నారు. అలా అని ఆమె మీద విరుచుకుపడలేరు. కారణం.. మహిళ కావటం. అలా అని చూస్తూ ఊరుకోలేరు.. ఎందుకంటే ఆమె ఇష్యూ అలాంటిది మరి. ఇంతకూ ఎవరీ మీనాక్షి? ఆమె వార్తల్లో వ్యక్తిగా ఎందుకు మారారు? అన్నది చూస్తే.. బోలెడన్ని విసయాలు బయటకు వస్తాయి.

మదురై తిరుమళ్లువర్ నగర్ కు చెందిన 38ఏళ్ల మీనాక్షికి పెళ్లైంది. భర్త పేరు మురుగేశన్. తన తల్లి చనిపోయిందని.. తనకు వారసత్వ సర్టిఫికేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకూ ఆమె తన తల్లిదండ్రులుగా ఎవరిని అడుగుతున్నారో తెలుసా? తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జయలలితను తన తల్లిగా.. తండ్రిని శోభన్ బాబుగా పేర్కొని.. అందుకు తగ్గట్లుగా అధికారిక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

దీంతో.. షాక్ తిన్న వారు ఏమాట్లాడాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. గుట్టు చప్పుడుకాకుండా దరఖాస్తు పెట్టుకున్న ఆమె.. అప్లికేషన్ ను క్లియర్ చేయటానికి నెల వ్యవధి దాటగానే వచ్చి.. తాను కోరినట్లుగా సర్టిఫికేట్ ఇవ్వాలని కోరుతున్నారు. అలా ఎలా ఇస్తామని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

తన తల్లి చెన్నై పోయిస్ గార్డెన్ నివాసి అయిన జయలలితగా ఆమె వాదిస్తున్నారు. దీంతో ఆమెతో వాదించే ఓపిక లేని అధికారులు.. చెన్నైకి వెళ్లి తీసుకోవాలని చెబుతున్నట్లు చెబుతున్నారు.

తన తల్లిదండ్రులు తనను అనాధగా వదిలి వెళ్లారని.. పళనిలోని బంగారురథం లాగే హక్కు తన తండ్రి శోభన్ బాబు తనకు ఇచ్చారని.. దానికి సంబంధించిన పత్రాలు పొందినట్లు చెబుతున్నారు. ఈ పత్రాలు ఇచ్చినప్పుడు వారసత్వ పత్రాలు ఎందుకు ఇవ్వరని మండిపడుతున్నారు. తన విన్నపాన్ని పట్టించుకోని అధికారుల మీద కోర్టుకు వెళతానని ఆమె వార్నింగ్ ఇస్తున్నారు.

దీంతో.. ఆమెకు ఎలా సర్ది చెప్పాలో అర్థం కాక అధికారులు కిందా మీదా పడుతున్నారు. గతంలోనూ కొందరు తాము జయలలిత.. శోభన్ బాబు పిల్లలమని బయటకు రావటం రచ్చ చేయటం తెలిసిందే.
Tags:    

Similar News