ఒకప్పుడు దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఇవాల్టిరోజున రెండంటే రెండు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. ఎందుకిలా? అంటే.. ఆ పార్టీకి చెందిన నేతల తీరే దీనికి కారణమని చెప్పాలి. మారిన కాలానికి అనుగుణంగా మారకపోవటం.. ప్రజల మనసుల్ని దోచుకోవటానికి అనుసరించాల్సిన విధానాల్ని మర్చిపోవటం.. రొడ్డు కొట్టుడు రాజకీయం తప్పించి.. మరేమీ చేతకాకపోవటం లాంటివెన్నో ఉన్నాయి. తాజాగా ఆ పార్టీ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్ కు చెందిన రాష్ట్ర మంత్రి ఒకరు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వివాదాస్పదంగా మారిన ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంతకీ ఆయనేమన్నారంటే..
"అత్యాచార కేసుల్లో మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే రాజస్థాన్ పురుషుల రాష్ట్రం" అంటూ నోరు పారేసుకున్నారు రాష్ట్ర శాసనసభా వ్యవహరాల మంత్రి ధరివాల్. ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేసినంతనే ఎవరు ఎక్కడ.. ఎప్పుడు రియాక్టు కావాలన్న దానికి సిద్ధంగా ఉన్న పలువురు వెంటనే రియాక్టు అవుతూ.. ఈ రచ్చను మరింత పెద్దదిగా చేస్తున్నారు.
మంత్రి చేసిన ఒళ్లు బలుపు వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహ్ జాద్ ట్వీట్ చేస్తూ.. ఇలాంటి విషయాల్లో ప్రియాంక గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నరు? అంటూ ప్రశ్నిస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డారు.
రాజస్థాన్ ప్రభుత్వంలో ఇలాంటి మంత్రులు ఉన్నందుకే ఆ రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి మంత్రులు ఉంటే రాష్ట్రంలోని మహిళలు ఎలా సేఫ్ గా ఉంటారు? అని ప్రశ్నించారు.
అంతేకాదు.. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన ఆమె.. సంబంధిత మంత్రిని సభ నుంచి సస్పెండ్ చేసి.. కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇంత రచ్చ జరిగిన తర్వాత కానీ సదరు మంత్రిగారి కళ్లు తెరుచుకోలేదు.చ తాను చేసిన వ్యాఖ్యల తీవ్రత అర్థమైంది. దీంతో ఆయన మాట్లాడుతూ.. తాను నోరు జారానని.. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
తాను మహిళల్ని ఎప్పుడూ గౌరవిస్తానని చెప్పారు. అనాల్సిన మాటలన్ని అనేసి.. జరగాల్సిన డ్యామేజీ అంతా జరిగిపోయిన తర్వాత ఎంత మొత్తుకున్నా ఏం లాభం?