పుతిన్ ప్రేయసి అలీనాను ఎక్కడ దాచారు..?

Update: 2022-03-09 09:29 GMT
రష్యా, ఉక్రెయిన్ల యుద్ధం తో పుతిన్, జెలెన్ స్కీల పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రపంచ దేశాలకు విలన్ కావడంతో ఆయన గురించి చాలా మంది తెలుసుకుంటున్నారు.ముఖ్యంగా పుతిన్ వ్యక్తిగత జీవితం పై చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పుతిన్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆయన ప్రేయసి అలీనా కబయేనా గురించి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పుతిన్ భార్యతో విడాకులు తీసుకున్న తరువాత అలీనాతో కొంతకాలంగా కలిసున్నారని, అయితే ప్రస్తతం ఆమె రష్యాలో లేదనే వార్తలు గుప్పుమంటున్నాయి.

అలీనా కబయేనా ఓ జిమ్నాస్టర్. 1983లో వ్లాదిమిర్ పుతిన్ ల్యూడ్మిలా అలెకస్సంద్రోనా పుతినాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు. వారి పేర్లు మరియా, కటేరినా. కొన్ని కారణాల వల్ల 2014లో ల్యూడ్మిలా..పుతిన్ నుంచి విడాకులు తీసుకుంది.

అయితే వీరి బంధం చెడిపోవడానికి అలీనా అలీనానే కారణమని అంటున్నారు. 2008 నుంచి అలీనా కబయేనాతో పుతిన్ కు సంబంధం ఉందని రహస్య సమాచారం.

పుతిన్ ఆమెతో డేటింగ్లో ఉండడం వల్ల ల్యూడ్మిలా విడాకులు తీసుకుందని అంటారు. అయితే అప్పటి వరకు రహస్య ఫస్ట్ లేడీగా కూడా కొనసాగినట్లు సమాచారం.

అలీనా కబయేనా 1983లో తాష్కెంటాలో పుట్టి పెరిగింది. రిథమిక్ జిమ్మాస్టిక్లో ప్రావీణ్యం చెందిన అలీనా 15 ఏళ్ల వయసులో యూరోపియన్ చాంపియన్ గా నిలిచి అందరి దృష్టిలో పడింది. 2000 సిడ్నీ ఒలంపిక్స్ లో కూడా బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. మొత్తం 14 సార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచింది.

అయితే 2001లో డోపింగ్ స్కాండల్స్ లో దొరికపోవడంతో రెండేళ్లపాటు నిషేధానికి గురైంది. ల్యూడ్మియాలతో విడాకుల తరువాత పుతిన్ ఆమెతో సంసా జీవితం సాగించారు. ఈక్రమంలో ఈ జంటకు నలుగురు పిల్లలు జన్మించారని రష్యా మీడియా తెలిపింది. అయితే అధికారికంగా పెళ్లి చేసుకున్న ల్యూడ్మియాను దూరం చేసుకున్నా అలీనాను మాత్రం అపురూపంగా చూసుకుంటున్నాడట.

ఇప్పుడు అలీనా గురించి జోరుగా చ్చ సాగుతోంది. ఇటీవల వచ్చిన కథనాల ప్రకారం ఆమె స్విట్జర్లాండ్లోని కొండల్లో సేద తీరుతున్నట్లు నిఘా వర్గాలు బయటపెట్టాయి. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతుండడంతో ముందు జాగ్రత్తగా అలీనాను సేఫ్ ప్లేసులో ఉంచినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె నలుగురు పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకుంటుందట. ఇదిలా ఉండగా కేవలం అలీనానే కాకుండా పుతిన్ అనేక మంది టీనేజ్ అమ్మాయిలతో డేటింగ్ చేశారని పుకార్లు వస్తున్నాయి. అయితే ఎంతవరకు నిజమో చూడాలి.


Tags:    

Similar News