రష్యాను భయపెడుతున్న ఉక్రెయిన్​..!

Update: 2022-03-14 02:30 GMT
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం 18వ రోజు కొనసాగుతోంది. రష్యా చేస్తున్న భీకర దాడులకు ఉక్రెయిన్ లోని చాలా నగరాలు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. రోజు రోజుకూ పుతిన్ సేనలు దాడుల డోసును మరింత పెంచుతున్నాయి. బాంబులు, క్షిపణి దాడులతో విరుచుకు పడుతున్నాయి. యుద్ధాన్ని ఆపే దిశగా పశ్చిమ దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ  రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.  

ఉక్రెయిన్ ఆక్రమణే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోతున్నారు. అయితే యుద్ధం జరిగే క్రమంలో ఇరు దేశాలు ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేల్చుకుంటున్నారు. వ్యాక్యూమ్ బాంబులు ప్రయోగించింది అన్ని ఉక్రెయిన్ రష్యా పై ఆరోపణలు చేస్తే.. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ పై ఇదే తరహా ఆరోపణలు చేసింది.

తమ దేశం పై ప్రయోగించేందుకు ఉక్రెయిన్ జీవ ఆయుధాలు సిద్ధం చేస్తుందని తాజాగా రష్యా కొత్త వాదనను తెరపైకి తీసుకుని వచ్చింది. యుద్ధం లో జీవ ఆయుధాలను ప్రయోగించడం నిషేధం అని చెప్పింది. దీనిని ఉక్రెయిన్ అతిక్రమిస్తుందని చెప్పుకొస్తోంది. ఇదే విషయాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చర్చించేందుకు ప్రత్యేక ఎమర్జెన్సీ మీటింగ్ ను ఏర్పాటు చేయాలని కోరింది.

ఇదిలా ఉంటే నిజంగా ఉక్రెయిన్ జీవ ఆయుధాలు ప్రయోగింస్తుందా అనే వార్తలు చర్చకు వస్తున్నాయి. వీటిని ప్రయోగిస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కానీ రష్యా చేస్తున్న ఈ ఆరోపణలను ఉక్రెయిన్, అగ్ర రాజ్యం అమెరికా లు కొట్టి పారేస్తున్నారు. అలాంటిది ఏం లేదని చెప్తున్నాయి.  కోవిడ్ సమయంలో ఉక్రెయిన్ లోని చాలా ల్యాబ్లు పరిశోధన కోసం తెరుచుకున్నాయి.

ఈ నేపథ్యంలో  ఆ ల్యాబ్ లో ఏమైనా జీవా ఆయుధాలు కానీ ఇతర హానీ చేసే వస్తువులు ఏమైనా ఉంటే వాటిని తక్షణమే  నాశనం చేయాలని ఉక్రెయిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచింది. కానీ తమ వద్ద  లాంటివి ఏమీ లేవని ఉక్రెయిన్ చెప్తుంది. రసాయన దాడి గురించి వాదన తెరపైకి వచ్చిన నాటి నుంచి దేశాల్లో భయం మొదలు అయ్యింది. ఎందుకంటే దీని ప్రభావం సాధారణ ఆయుధాల కంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ భయం.

ఈ రసాయన పదార్థాల ప్రయోగం జరిగితే వాటి ప్రభావం మనుషుల మీద చాలా ఘోరంగా పడుతుంది. మానవుని ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులతో బాగా ఇబ్బందులు పడతారు. దీని ప్రభావం ఒకసారి కాక పోయిన అంచెలంచెలుగా పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఊపిరితిత్తులకు ఆ గాలి సోకితే దెబ్బతింటాయి. కొన్ని రసాయన పదార్థాల వల్ల మనుషుల చర్మాలు పొక్కులు పొక్కులు గా వచ్చేస్తాయి. మరి కొంత మంది కంటి చూపు పోయే ప్రమాదం ఉంది. చర్మ వ్యాధులు ఎక్కువ అవుతాయి. ఇలా ఒకటని కాదు చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఉంటుంది.
 
రసాయన దాడితో మనుషులు చనిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి దీనిని 1997లో నిషేధించారు. ఇందుకు సంబంధించిన ఒప్పందంలో రష్యా కూడా సంతకం చేసింది. అందుకే వాటిని ఉపయోగించడం చట్ట విరుద్ధం అని చెప్పుకొస్తోంది. కానీ ఇప్పటికే చాలా దేశాలు వివిధ  యుద్ధ సమయాల్లో ఈ దాడులకు పాల్పడుతున్నాయి.

    
    
    

Tags:    

Similar News