కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన తాజా ఆరోపణలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్ ప్రజాస్వామ్యానికి ఏ విధంగా ముప్పంటే ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఈ సామాజిక మాద్యమాలను వాడుకుంటున్నారట. దీనికి ఉదాహరణగా ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ చేసిన ప్రచారం తీరుతెన్నులను సోనియా ఉదహరించారు. ఎన్నికల రాజకీయాల్లో సామాజిక మాధ్యమాల అనుచిత జోక్యాన్ని నివారించాలంటు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇక్కడ సోనియా వైఖరి ఎలాగుందంటే ఆడలేక మద్దెల ఓడన్న సామెతలాగుంది. యూపీ ఎన్నికల్లో బీజేపీ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసుకుంది. పార్టీ, అభ్యర్థుల ప్రచారం కోసం బీజేపీ సుమారుగా 2.5 లక్షల మందితో ప్రత్యేకంగా డిజిటల్ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసుకుంది. వీళ్ళంతా ప్రతిరోజు ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ లాంటి మాధ్యమాల ద్వారా బీజేపీ+అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేశారు. పనిలోపనిగా ప్రత్యర్ధి పార్టీలు వాటి అభ్యర్ధులపై నెగిటివ్ ప్రచారం ఎలాగూ చేస్తారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే బీజేపీ అంత కాకపోయినా కాంగ్రెస్ కూడా పై డిజిటల్ ప్లాట్ ఫాంను బాగానే వాడుకుంది. కాకపోతే కాంగ్రెస్ ప్రచారాన్ని జనాలెవరు పట్టించుకోలేదు. బహుశా ఈ విషయమే సోనియా, రాహుల్ ను బాధించుంటుంది.
ప్రచారం ఎప్పటికప్పుడు కొంతపుంతలు తొక్కుతోంది. డిజిటల్ ప్లాట్ ఫాంను వాడుకోవటంలో తప్పేమీలేదు. కాకపోతే ఆ ప్రచారం హద్దులు దాటకుండా చూసుకోవాలంతే. సామాజికమాధ్యమాలను కొందరు దుర్వినియోగపరుస్తున్నారంటు పరోక్షంగా బీజేపీపై సోనియా మండిపడ్డారు. నిజానికి దీనివల్ల ఎలాంటి ఉపయోగంలేదని అందరికీ తెలిసిందే.
ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్ లాంటివాటిని నియంత్రించాలని అనుకోవటమే వేస్టు. ఎందుకంటే ఇవన్నీ ఎవరి నియంత్రణలోను ఉండవు. ఎవరికి శక్తుంటే వాళ్ళు సమర్ధవంతంగా ప్రచారం చేసుకుంటారు. ఎవరెంత ఈ మాధ్యమాలను ఉపయోగించుకున్నా అల్టిమేట్ గా కన్వీన్సవ్వాల్సింది జనాలే. జనాలు ఓట్లేస్తేనే కదా వీటి ఉపయోగం.
అన్నీ రాజకీయపార్టీలకు ఈ కంపెనీలు సమాన ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆరోపణల్లోనే డొల్లతనం కనబడుతోంది. కంపెనీలు రాజకీయపార్టీలకు సమాన ప్రాధాన్యతివ్వవు. పార్టీలే సామాజికమాధ్యమాలను సమర్ధవంతంగా ఉపయోగించుకునే నిపుణులను పెట్టుకోవాలి. అభ్యంతరాలుంటే కంపెనీల యాజమాన్యాలే పోస్టులను తొలగిస్తున్న విషయం చూస్తున్నదే.