టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 29న జరగనుంది. టీడీపీకి ఇది అతి ముఖ్యమైన వేడుక. పార్టీని ఎన్టీయార్ స్థాపించి సరిగ్గా నలభై ఏళ్ళు అవుతుంది. దాంతో అంగరంగ వైభవంగా ఈ సంబరాన్ని జరుపుకోవడానికి టీడీపీ అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.
వాడవాడలా ఆవిర్భావ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించాలని ఇప్పటికే అధినాయకుడు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు చూస్తే వైసీపీ కూడా గురి చూసి మరీ ఆవిర్భావ వేడుకల వేళ బస్తీ మే సవాల్ అంటోంది.
మీది నలభయ్యేళ్ళ చరిత్ర. మాది 34 నెలల పాలన. రెండింటినీ పోల్చి చూసుకుందామా అంటూ సవాల్ చేస్తున్నారు వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు. మీది అంతా అరాచక పాలన. మాది అద్భుత పాలన అని ఆయన అంటున్నారు.
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ ఆశయం మద్య పాన నిషేధం. దాన్నికి తూట్లు పొడిచిన చరిత్ర టీడీపీది. మద్య పాన నిషేధాన్ని సమర్ధంగా దశల వారీగా అమలు చేస్తున్న హిస్టరీ మాది అని చెప్పుకున్నారు. ఇక టీడీపీ చంద్రబాబు ఏలుబడిలో ఒక్క సంస్కరణ అయినా తీసుకువచ్చిందా అని నిలదీస్తున్నారు.
ఏపీలో కొత్త జిల్లాలతో పాటు కొత్త విధానాలతో జగన్ పాలన చేస్తున్నారు. మొత్తానికి మీ ప్రతాపం, మా ప్రతాపం చూసుకోవడానికి టీడీపీ ఆవిర్భావ వేడుకలే ముహూర్తం అని అంటున్నారు.
మరి దీనికి లోకేష్ బాబుని పంపినా చర్చకు తాము సిద్ధమని కూడా ప్రకటిస్తున్నారు. టీడీపీ దీని మీద ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.