మరోసారి ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

Update: 2022-03-21 08:30 GMT
ఏపీ అసెంబ్లీలో జంగారెడ్డి గూడెం మరణాలు, పెగాసస్ అంశాలు కుదిపేశాయి.  దీంతో అధికార విపక్ష సభ్యుల వాగ్వివాదంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరోజు సస్పెన్షన్ వేటుకు గురయ్యాయి. చంద్రబాబు సీఎంగా ఉండగా ‘పెగాసస్’ కొన్నారని ఆరోపణలు రావడంతో దీనిపై చర్చకు వైసీపీ డిమాండ్ చేసింది. జంగారెడ్డి గూడెం మరణాల అంశంపై సభలో మరోసారి చర్చించాలని టీడీపీ డిమాండ్ చేసింది. గందరగోళం మధ్యనే బెంగాల్ సీఎం మమత బెనర్జీ మాట్లాడిన చంద్రబాబు పెగాసస్ కొన్నారన్న వ్యాఖ్యలను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో ప్రస్తావించారు.

ఈ క్రమంలోనే పెగాసస్ పై చర్చకు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి నోటీస్ ఇచ్చారు. చర్చకు స్పీకర్ తమ్మినేని అంగీకారం తెలిపారు. దీనిపై చర్చ ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. పెగాసస్ అంశాన్ని సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుందని అన్నారు. పెగాసస్ పై కమిటీ వేసి సుప్రీంకోర్టు దర్యాప్తు చేపట్టిందన్నారు.

చంద్రబాబు హయాంలోనే పెగాసస్ ను వాడారని బెంగాల్ సీఎం మమతాబెనర్జీ చెప్పారని మంత్రి అన్నారు. పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా ఫోన్లు ట్యాపింగ్ చేసే అవకాశముందున్నారు. పెగాసస్ పై చర్చించి కమిటీకి రిపోర్టు చేయాల్సిన బాధ్యత ఉందని మంత్రి అన్నారు.

అయితే టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం జంగారెడ్డి గూడెం మరణాలపై చర్చకు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్ద బైటాయించి నినాదాలు చేశారు. జ్యూడిషియల్ విచారణకు డిమాండ్ చేశారు. ఆ తర్వాత బల్లలు చరస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు.

ఈ క్రమంలోనే ‘ఇది శాసనసభ.. వీధి మార్కెట్ కాదు.. మీరు వీధి రౌడీలు కాదు’ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యే సభ గౌరవాన్ని దిగజార్చుతున్నారని విమర్శించారు.
Tags:    

Similar News