ప్రముఖ బిజినెస్ మ్యాన్ భార్యతో సెక్స్ చేశా.. అదీ అతడి కోరిక మేరకే!

Update: 2022-03-15 01:06 GMT
రియాల్టీ షోల కాలం నడుస్తోంది. ఎంత మసాలా ఉంటే అంత వ్యూయర్ షిప్ అన్నట్లుగా మారింది. సెలబ్రిటీలతో నిర్వహించే షోలకు ఉండే ఆదరణ ఒక ఎత్తు అయితే.. అలాంటి వారి నోటి నుంచి వచ్చే సంచలన వ్యాఖ్యలు విన్నంతనే.. ప్రేక్షకులు ఎంతలా  కనెక్టు అవుతారన్న విషయాన్ని తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రౌనత్ నిర్వహిస్తున్న 'లాకప్' రియాల్టీషోతో మరోసారి నిరూపిస్తోంది. అల్ట్ బాలాజీ.. ఎంఎక్స్ ప్లైయర్ ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద టెలికాస్ట్ అవుతున్న ఈ  షోలో తాజాగా మరో సంచలనం చోటుచేసుకుంది. తాజాగా షో నుంచి ఎలిమినేట్ అయిన వ్యాపారవేత్త కమ్ సామాజిక హక్కుల కార్యకర్తగా సుపరిచితుడు.. బిగ్ బాస్ 13వ సీజన్ లో కంటెస్టెంట్ అయిన తెహ్సీన్ పూనావాలా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
 
తాను ఎలిమినేట్ అయ్యే వేళలో.. మరో కంటెస్టెంట్ ను సేవ్ చేసే ఛాన్స్ ను హోస్టు కంగనా ఇవ్వటం.. అందులో భాగంగా తాను ఇప్పటివరకు బయటకు చెప్పని తన జీవితంలోని టాప్ సీక్రెట్ ను బయటపెట్టాలన్న కంగనా కండీషన్ కు ఓకే చెప్పిన అతడు.. తాను దేశంలోనే అతి పెద్ద పారిశ్రామికవేత్త ఒకరు తన భార్యతో  శృంగారం చేయాలని కోరటం.. అందుకు ఒక వీకెండ్ లగ్జరీ నైట్ క్లబ్ లో రెండు రోజులు బస చేసిన వైనాన్ని వెల్లడించారు.

అతగాడు చెప్పిన మాటలతో ప్రేక్షకులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా.. వ్యాపార ప్రపంచంలో సంచలనంగా మారింది. అతగాడి వ్యాఖ్యలతో ఒకింత ఆశ్చర్యపోయిన కంగనా సైతం.. 'నువ్వు అతడి భార్యతో శృంగారం చేశావా?' అని అడగ్గా.. తాను ఎంజాయ్ చేశానని.. అప్పటికి తనకింకా పెళ్లి కాలేదన్నారు.

అయితే.. తన భార్యతో నేను శృంగారం చేసే సమయంలో దూరం నుంచి చూస్తానన్న కండీషన్ పెట్టాడని.. అయితే.. అతను దూరం నుంచి చూడాలే కానీ డిస్ట్రబ్ చేయకూడదని తాను కూడా కండీషన్ పెట్టినట్లు వెల్లడించాడు. అతడికి అలాంటి ఎంజాయ్ మెంట్ ఇష్టమని పేర్కొన్నాడు.

తానీ విషయాన్ని ఇప్పుడు చెప్పటంలో తనకెలాంటి అభ్యంతరం లేదని.. ఎందుకంటే అందులో తప్పేం లేదన్నారు. వారి కోరికను తాను తీర్చానని చెప్పాడు. మరి.. ఈ రహస్యం నీ భార్యకు తెలుసా? అని కంగనా ప్రశ్నించగా.. ఆ విషయం తెలుసని..తన భార్యతో తాను డేటింగ్ లో ఉన్న వేళలోనే ఈ సీక్రెట్ ను తనకు చెప్పినట్లుగా వెల్లడించారు.  మరి.. ఇందులో నిజం ఎంతన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఎందుకంటే.. సంచలనాల కోసం ఇలాంటి విషయాల్ని చెబుతున్నారా? లేక నిజంగానే జరిగాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా.. ఇలా మూడు సంచలనాలు.. ఆరు షాకులుగా సాగుతున్న ఈ రియాల్టీ షోలో మరెన్ని సంచలనాలు నమోదు కానున్నాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News