వరాల సీఎంగా పేరున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆ వరాలకు అవసరమైన నిధుల సాధనకు వాతలు మినహా మరో మార్గం లేదన్న విషయాన్ని తన చేతలతో చేసి చూపించారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంటు ఛార్జీల్ని పెంచుతూ సీఎం కేసీఆర్ ఓకే చెప్పటంతో మరో వారంలో మొదలయ్యే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త విద్యుత్ ఛార్జీల వాతలు షురూ కానున్నాయి.
ఇంతకీ ఈ వాతల తీవ్రత ఎంత? పెంచిన ఛార్జీలతో రాష్ట్రం మొత్తమ్మీద పడే భారం ఎంత? సామాన్యుడి మీద పడే పోటు ఎంత? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. పెంచిన ఛార్జీలతో రాష్ట్రం మొత్తమ్మీదా పడిన భారం అక్షరాల రూ.5596 కోట్లుగా తేల్చారు. ఇంటి విద్యుత్ వినియోగదారులకు యూనిట్ కు 40 పైసలు నుంచి 50 పైసలకు పెంచి.. ఇతర వర్గాలకు యూనిట్ కు రూపాయి చొప్పున పెంచేశారు.
అన్నింటికి మించిన నెల వారీగా 300 యూనిట్ల వినియోగం దాటిన వారికి భారీగా పోటు పడనుంది. అలాంటి వారికి యూనిట్ ఒక్కింటికి రూ.9 చొప్పున వసూలు చేయనున్నారు. అదే నెల వారీగా యాభై యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే యూనిట్ రూ.1.95కు పరిమితం కానుంది.
తాజా వాతల నుంచి తప్పించుకున్న వారిని చూస్తే వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వటం.. సెలూన్లకు ఫ్రీ కరెంట్.. కుటీర పరిశ్రమలకు.. విద్యుత్ వాహనాలకు పెంపు లేదని పేర్కొన్నారు.
ఎస్సీ ఎస్టీ ప్రజలకు 101 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది ఆదాయ.. వ్యయాల మధ్య లోటు రూ.16,866.53 కోట్లు ఉందని.. దాన్ని పూడ్చుకోవటానికే చార్జీల పెంపు చేపట్టినట్లుగా పేర్కొన్నారు.
విద్యుత్ ఛార్జీలను 2016-17 నుంచి ఇప్పటివరకు పెంచలేదని.. అందుకే పెంచుతున్నట్లుగా సమర్థించుకున్నారు. మొత్తంగా విద్యుత్ చార్జీల పెంపుతో వాతలు మొదలైనట్లేనని చెప్పక తప్పదు. ఇప్పటికే పెట్రోల్.. డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటం.. గ్యాస్ బండ పై కూడా బాదుడు షురూ కావటం తెలిసిందే. ఇలాంటివేళలో విద్యుత్ చార్జీలు పెంపుతో మొదలైన బాదుడు పర్వం మరెంత వరకు వెళుతుందో చూడాలి.