రష్యా యుద్ధం మొదలు పెట్టి ఇప్పటికి 14 రోజులైనా ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోలేకపోతోంది. ఉక్రెయినే కదా అని చాలా తేలిగ్గా తీసుకున్నది రష్యా. నిజానికి రష్యా రక్షణ దళం తో పోల్చితే ఉక్రెయిన్ చిట్టెలుకనే చెప్పాలి. అందుకనే పరిమిత సైన్యంతోనే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగింది. అయితే యుద్ధానికి ముందు రష్యా అనుకున్నది ఒకటైతే తర్వాత జరుగుతున్నది మరొకటి.
సైన్యపరంగా తీసుకున్నా, ఆయుధాల పరంగా తీసుకున్న ఉక్రెయిన్ ఎందుకు పనికిరాదు. కానీ ఇన్నిరోజులుగా రష్యాను ధీటుగా ఎదిరించి ఉక్రెయిన్ ఎలా పోరాడగలుగుతోంది ? ఉక్రెయిన్ చేతికి దగ్గర అత్యంత అధునాతన ఆయుధాలు ఎలా చేరాయి ? ఎలాగంటే నాటో దేశాలు మద్దతు ప్రకటించటం వల్లే.
నాటో దేశాల్లో ఉక్రెయిన్ కు సభ్యత్వం లేకపోయినా రష్యా అంటే పడని కారణంగా అవన్నీ ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచాయి. ప్రత్యక్షంగా సైన్యాలను పంపకపోయినా తమ దగ్గరున్న ఆయుధాలను అందించాయి.
20కి పైగా దేశాలు ప్రధానంగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడెన్, పోలండ్, చెకెస్లోవేకియా, బ్రిటన్ లాంటి దేశాలు ఫుల్లుగా ఆయుధాలను అందించాయి. వేలసంఖ్యలో యుద్ధట్యాంకు విధ్వంసకర క్షిపణలు, వేలాది మెషీన్ గన్లు, లైట్ మెషీన్ గన్లు, స్టింగర్ క్షిపణలు, లక్షల సంఖ్యలో రివాల్వార్లు, దాదాపు లక్షకు పైడా ఏకే 47, ఏకే 57 తుపాకులు, లక్షల సంఖ్యలో గ్రనేడ్లు, వేలాది రాకెట్ లాంచర్లు వచ్చి చేరిపోయాయి.
నాటో దేశాలు అందించిన ఆయుధాల కారణంగానే ఉక్రెయిన్ ప్రభుత్వం మామూలు జనాలకు కూడా ఆయుధాలను అందించేసింది. ఉక్రెయిన్ సైన్యంతో పాటు మామూలు జనాలు కూడా ఆయుధాలను పట్టుకుని రష్యా సైన్యంపై యుద్ధం చేస్తున్నారు. తమ సైన్యంపై మామూలు జనాలు కూడా ఆయుధాలతో యుద్ధానికి దిగుతారని రష్యా ఊహిచుండదు. అందుకనే ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవటానికి రష్యా ఇన్ని రోజులు పడుతోంది.
ఎప్పటికైనా రష్యాకు ఉక్రెయిన్ లొంగకతప్పదు. కాకపోతే అప్పటికే రష్యాకు భారీ నష్టాలు తప్పవంతే. ఉక్రెయిన్ను చాలా తేలికగా తీసుకుని యుద్ధానికి దిగినందుకు రష్యా మూల్యం చెల్లిస్తోందిపుడు.