రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం మరింత ముదురుతోంది. ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలి అనే ఆలోచన తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ సరిహద్దుల్లో భారీగా సైనిక బలగాలను మోహరించారు. లక్షల సంఖ్యలో సైనికులు సరిహద్దులకు చేరుకున్నారు. అంతేగాకుండా ఇప్పటికే రష్యా అనేక సార్లు ఉక్రెయిన్ హెచ్చరిస్తూ వస్తుంది.
సరిహద్దుల్లో ఇప్పటికే యుద్ధ విన్యాసాలను రష్యా ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఖండాతర క్షిపణులను ప్రయోగించింది. ఇదే విషయాన్ని ఆ దేశ అధికారులు కూడా పేర్కొన్నారు. మరోవైపు సమర శంఖం పూరించినట్లు ఇప్పటికే రష్యా.. ఉక్రెయిన్ కు చెందిన ఐదుగురు సైనికులను మట్టు పెట్టి మరింత హీట్ పెంచింది. అయితే దీనిపై స్పందించిన ఉక్రెయిన్ రష్యా ప్రకటించిన విధంగా ఏం జరగలేదని చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉక్రెయిన్ భూభాగానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. తాజాగా చేసిన ఈ ప్రకటనతో రష్యా- ఉక్రెయిన్ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఉక్రెయిన్ కు తూర్పు వైపున ఉన్న రెండు రాష్ట్రాలైన డొనెట్స్క్, లుహాన్స్క్‌లను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఇకపై అవి ఉక్రెయిన్ లో భాగం కావని తెలిపారు.
రిపబ్లిక్ రష్యా ఆక్రమిత ప్రాంతాలుగా వాటిని గుర్తిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కు పుతిని ఆమోద ముద్ర వేశారు. ఇప్పుడు ప్రకటించిన ఈ రెండు రీజియన్లకు ఇకపై ఉక్రెయిన్ తో ఎలాంటి సంబంధం ఉండబోదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రష్యా ఇలా ప్రకటించడం పట్ల చాలా దేశాలు అసహనం వ్యక్తం చేశాయి. అగ్రరాజ్యం అయిన అమెరికాతో పాటు జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్ లాంటి దేశాలు పుతిన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
డొనెట్స్క్, లుహాన్స్క్ రీజియన్లు ఆక్రమించినట్లు చెప్తున్న రష్యా... కొత్త వాదనను ముందుకు తీసుకుని వచ్చింది. ప్రస్తుతం ఆక్రమించిన ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఉక్రెయిన్ నుంచి విడిపోయి... రష్యాలో భాగం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. అయితే రష్యా చేసిన ఈ ప్రకటనను ఉక్రెయిన్ కొట్టిపారేయలేదు. కానీ ఇతర దేశాలు మాత్రం ఈ వాదనను తొసిపుచ్చడంతో పాటు పుతిన్ కయ్యానికి కాలు దువ్వుతున్న చెప్పుకొచ్చారు. అంతేగాకుండా ఈ పర్యవసానాలకు పుతిన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ ప్రాంతాలను స్వతంత్ర రాష్ట్రం గా గుర్తించిన నంతరం అమెరికా పై తీవ్ర స్థాయిలో మండి పడ్డాయి. ఆ దేశంతో పాటు నాటో, ఉక్రెయిన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు అధ్యక్షుడు పుతిన్. గతంలో మాదిరిగా ఉక్రెయిన్ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని పేర్కొన్నాడు. అగ్రరాజ్యం ఎలా చెప్తే అలా చేస్తున్నట్లు తెలిపాడు. ఉక్రెయిన్ ను అమెరికా చేతిలో ఉండే ఓ కీలుబొమ్మ గా అభివర్ణించాడు పుతిన్. అందుకే ఆ దేశం నుంచి విడిపోవడానికి అక్కడి ప్రజలు మొగ్గు చూపుతున్నారని అన్నారు. అంతేగాకుండా నాటో బలగాలతో చెయ్యి కలిపిన ఉక్రెయిన్ ... రష్యా శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంది.