పోటాపోటీగా పీసీసీ పదవిని ఆశించి.. ఆపై భంగపడి.. పార్టీకి దూరమా? దగ్గరా? తెలియకుండా..? అప్పుడప్పుడు తీవ్ర స్థాయి అసమ్మతి స్వరం వినిపిస్తూ వస్తున్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి. ఉన్నట్టుండి గత నెలలో కలకలం రేపారు. ఏం చేస్తారో చూడాలి అనుకుంటుండగా.. సీఎల్పీ భేటీకి హాజరై ఆ వెంటనే విమర్శలు చేస్తూ వెళ్లిపోయారు. అసలు జగ్గారెడ్డి సమస్య ఏమిటో తెలుసుకునేందుకు అధిష్ఠానం పిలుపు వస్తుందని భావిస్తున్నారు.
ఆయన కూడా ఇదే నమ్మకంతో ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, జగ్గారెడ్డి తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని.. దీనివెనుక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి రేవంత్ కి పీసీసీ పదవి దక్కినందుకు సంతోషంగా లేని జగ్గారెడ్డి అప్పటినుంచి ఏదో ఒక అంశంపై స్వరం వినిపిస్తూనే ఉన్నారు. అదే సమయంలో కొన్ని సమస్యలపై ప్రభుత్వాన్నీ ప్రశ్నిస్తున్నారు.
ఇది ఆయనకు వ్యక్తిగతంగా మంచి పేరు తెచ్చిపెడుతోంది కూడా. కాగా, ఇటీవల కాలంలో పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒకరికొకరు ఎదురుపడ్డారు. పరస్పరం పలకరించుకున్నారు. సీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఇందుకు వేదికైంది.
ముందుగా పలకరించింది జగ్గన్నే..అసెంబ్లీకి వచ్చిన పీసీపీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ముందుగా పలకరించింది జగ్గారెడ్డే. ఆయన ఎదురుపడగానే జగ్గారెడ్డి ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగా కరచాలనం చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం ఇద్దరు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 20 నిమిషాలకు పైగా వారి సమావేశం జరిగింది. ఆ తర్వాత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో ఏం మాట్లాడుకున్నామనే విషయాన్ని బహిర్గతం చేయబోమని చెప్పారు. కొంతకాలంగా రాష్ట్ర కాంగ్రెస్‌లో కొందరు నేతల వ్యవహార శైలిపై జగ్గారెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పార్టీని సైతం వీడుతానని ప్రకటించారు. ఇటీవల మెదక్ జిల్లాలో రేవంత్‌రెడ్డి పర్యటనపైనా జగ్గారెడ్డి విమర్శలు చేశారు. జిల్లా పర్యటనకు వస్తున్నట్లు తనకు సమాచారం కూడా లేదన్నారు. ఇలా చాలా సార్లు అవమానం జరిగిందంటూ కొద్దిరోజుల క్రితం సీఎల్పీ సమావేశం సందర్భంగా భట్టి విక్రమార్క తదితరులతో చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్‌రెడ్డిని జగ్గారెడ్డి ఆత్మీయంగా పలకరించుకోవడం ఆసక్తిగా మారింది.
మరి సంగారెడ్డి మీటింగ్ సంగతో..?
జగ్గారెడ్డి ఈ నెల 20 తర్వాత సంగారెడ్డిలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తానని అంటున్నారు. కేవలం తన నియోజకవర్గ ప్రజలతో ఈ సభ ఉంటుందని చెబుతున్నారు. కానీ, ఆయన తాజాగా రేవంత్ తో భేటీ అయిన నేపథ్యంలో సభ భవితవ్వం ఏమిటో తెలియాల్సి ఉంది. రేవంత్ -జగ్గారెడ్డి కలయిక సంధికి సంకేతమే అయితే.. సంగారెడ్డి సభ లేనట్లే.