ప్రపంచంలోనే పెద్ద స్టేడియంలో నేడే ఐపీఎల్ ఫైనల్.. ఎవరు గెలిచినా చరిత్రే..
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో క్రికెట్ లీగ్ లు ఉండొచ్చు. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్థాయి వేరు. అంతటి ఉత్తమ లీగ్ ఇది. ఒకటీ కాదు రెండు కాదు 70 రోజుల సంరంభం. మార్చి 26న ప్రారంభమైన లీగ్.. నేటితో ముగియనుంది. ఈసారి కొత్తగా రెండు జట్లతో కలిపి పది జట్లతో జరిగిన లీగ్ సంపూర్తిగా అలరించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 8 గంటలకు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య తుది సమరం జరుగనుంది.
గుజరాత్ ఈ సీజన్ లో తొలిసారిగా అడుగుపెట్టింది. అంతేకాక లీగ్ దశలో గుజరాత్ టాప్ లో నిలిచింది. రాజస్థాన్ 2వ స్థానంలో వచ్చింది. గుజరాత్ 10 విజయాలతో 20 పాయింట్లు సాధించింది.
9 విజయాలతో రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కూడా 9 విజయాలే సాధించినా.. మెరుగైన నెట్ రన్‌రేట్‌తో రాజస్థాన్ దాన్ని వెనక్కి నెట్టింది. చిత్రమేమంటే.. 2016లో హైదరాబాద్ ట్రోఫీ నెగ్గాక ఇప్పటివరకు కొత్త జట్టు విజేతగా నిలవలేదు.తొలి సీజన్లోనే ఫైనల్ చేరిన గుజరాత్.. అదే ఊపులో కప్పు పట్టేయాలని చూస్తుండగా, తొలి సీజన్లో టైటిల్ గెలిచాక ఇంత కాలానికి మళ్లీ ఫైనల్లో అడుగుపెట్టిన రాజస్థాన్.. ఈ అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తోంది.
వాస్తవానికి లీగ్ ప్రారంభంలో ఈ రెండు జట్లపై పెద్దగా అంచనాల్లేవు. అయితే, అనూహ్యంగా ఫైనల్ కు చేరాయి. గుజరాత్ మొదటి నుంచి విజయాల బాటలోనే సాగగా.. రాజస్థాన్ కాస్త కష్టంగా ఫైనల్ కు వచ్చింది. కాగా, తొలి క్వాలిఫయర్లోనూ సునాయాసంగా నెగ్గి ఫైనల్ చేరింది గుజరాత్.
చాలా ఏళ్ల తర్వాత నిలకడగా ఆడి రెండో స్థానంతో లీగ్ ముగించి, తొలి క్వాలిఫయర్లో ఓడినా, రెండో క్వాలిఫయర్లో అలవోకగా నెగ్గి తుది సమరానికి అర్హత సాధించింది రాజస్థాన్. ఈ సీజన్లో ఏ జట్టుకూ సాధ్యం కాని నిలకడకు తోడు.. ఆడిన రెండుసార్లూ రాజస్థాన్‌ను ఓడించడం గుజరాత్‌ను ఫేవరెట్‌గా నిలిపేదే. కానీ భీకర బ్యాట్స్‌మెన్, నాణ్యమైన బౌలర్లు ఉన్న రాజస్థాన్‌ను తక్కువగా అంచనా వేయలేం.
స్టార్లు లేకున్నా.. గుజరాత్
ఒకరిద్దరికి మించి నాణ్యమైన బ్యాట్స్ మెన్ లేకున్నా.. మెరుగైన బౌలర్లు ఒకరిద్దరే ఉన్నా.. టోర్నీలో సమష్టిగా ఆడింది గుజరాత్. అసలు ఆడతాడని ఊహించని సాహా మంచి ఆరంభాలతో జట్టుకు పెద్ద బలంగా మారాడు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కొన్ని మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లీగ్ దశ ప్రథమార్ధంలో అదరగొట్టిన హార్దిక్.. మధ్యలో జోరు తగ్గించినా, లయ అందుకున్నాడు. దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్ మన్ డేవిడ్ మిల్లర్ ఎన్నడూ లేనంత నిలకడతో జట్టుకు బలంగా మారాడు.
ఆల్ రౌండర్ రాహుల్ తెవాతియా రెండు మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు. అవసరానికి తగ్గట్లు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవడంతో బ్యాటింగ్‌లో గుజరాత్ బెంగ లేకుండా పోతోంది. బౌలింగ్‌లో మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రత్యర్థులకు గట్టి సవాలు విసురుతుండగా.. అప్పుడప్పుడూ షమి చెలరేగుతున్నాడు. ఆలస్యంగా జట్టులోకి వచ్చిన సాయికిశోర్ ఆకట్టుకుంటున్నాడు. యశ్ దయాల్ కూడా సత్తా చాటాడు. అయిదో బౌలర్ విషయంలో మాత్రం గుజరాత్ సమస్య ఎదుర్కొంటోంది. జోసెఫ్ కానీ, ఫెర్గూసన్ కానీ నిలకడగా రాణించట్లేదు. వీరితో ఫైనల్‌కు తుది జట్టులో ఎవరు చోటు దక్కించుకున్నా, సత్తా చాటాల్సిన అవసరముంది.
బట్లర్ నిలిస్తే రాజస్థాన్ గెలిచినట్లే
జాస్ బట్లర్, సంజు శాంసన్, షిమ్రన్ హెట్ మెయిర్ వంటి భారీ హిట్టర్లు, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్క ల్ వంటి కుర్రాళ్లు రాజస్థాన్ జట్టులో ఉన్నారు. వీరిలో ముగ్గురు నిలిచినా స్కోరు బోర్డు ఎక్కడికో వెళ్లిపోతుందనడంలో సందేహం లేదు. బౌలింగ్‌లో బౌల్ట్, చాహల్, అశ్విన్ లాంటి అంతర్జాతీయ స్టార్ల అండ ఆ జట్టుకుంది. మెకాయ్, ప్రసిద్ధ్ సైతం కొన్ని మ్యాచ్‌ల్లో చక్కటి ప్రదర్శన చేశారు. రెండో క్వాలిఫయర్లో ఈ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ప్రధాన బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఇదే జోరు కొనసాగిస్తే.. రాజస్థాన్‌కు తిరుగుండదు.
రాజస్థాన్ విజయావకాశాలు బట్లర్ మీదే ఉన్నాయనడంలో సందేహం లేదు. ఈ సీజన్లో అతడు 824 పరుగులు చేశాడు. 4 శతకాలు కొట్టాడు. లీగ్ దశ చివర్లో కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమై ఆందోళన రేకెత్తించిన అతను.. ప్లేఆఫ్స్‌లోకి వచ్చాక జోరందుకున్నాడు. తొలి క్వాలిఫయర్లో 89 పరుగులు చేశాడు. రెండో క్వాలిఫయర్లో మొదట బౌలర్లు అదరగొడితే.. తర్వాత బట్లర్ సెంచరీతో మిగతా పని పూర్తి చేశాడు. కాబట్టి ఫైనల్లో బట్లర్ ఆటను బట్టే రాజస్థాన్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. కానీ రషీద్ ఖాన్ బౌలింగ్ లో పేలవ రికార్డున్న బట్లర్.. ఫైనల్లో అతణ్ని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.