దేశంలోని ధనిక రాష్ట్రాల్లో ఒకటిగా చెప్పుకునే తెలంగాణ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏమిటి? దాని ఆర్థికాభివృద్ధి ఎలా ఉంది? ఏడున్నరేళ్ల క్రితం ఏర్పాటైన రాష్ట్రం మిగులు బడ్జెట్ లో తన ప్రయాణాన్ని షురూ చేయటం తెలిసిందే. మరిప్పుడు పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని రిజర్వు బ్యాంకువిడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు.
దేశంలోని అన్ని రాష్టరాల ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయన్న అంశంపై రిజర్వు బ్యాంకు నివేదిక వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆ నివేదికలో ఏం చెప్పారు? ఏయే అంశాల్ని ప్రస్తావించారు? అన్న విషయాల్ని చూస్తే..
- రాష్ట్ర ఆవిర్భావం తర్వాతి నుంచి ఏడేళ్లలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ఏకంగా 117 శాతం వృద్ధి నమోదు చేసింది. వృద్ధిని పలు విభాగాల్లో నమోదు చేసింది.
ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే.. 2013–14లో రూ.4,51,580.4 కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి) విలువ.. 2020–21 నాటికి రూ.9,80,407 కోట్లకు పెరిగింది.
- ఐటీ.. ఐటీ అనుబంధ సేవలు.. ఔషధ రంగ పరిశ్రమలతోపాటు వ్యవసాయం.. అనుబంధ రంగాలు రాష్ట్ర వృద్ధికి అండగా నిలిచాయి. బ్యాంకింగ్, బీమా, తయారీ, నిర్మాణ రంగాలు కూడా వృద్ధికి ఊతమిస్తున్నాయి. పంటల ఉత్పత్తి బాగా పెరిగింది.
- గత ఏడేళ్లలో రాష్ట్రం సొంత పన్నులు, పన్నేతర ఆదాయాన్ని సైతం భారీగా పెంచుకుంది. కానీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం భారీగా రుణాల్ని తీసుకుంది. దీంతో ఏడాదికేడాది అప్పులు కూడా పెరిగిపోయాయి. వాటిపై చెల్లిస్తున్న వడ్డీలు భారంగా మారుతున్నాయి. బడ్జెట్ ప్రతిపాదనల్లో రెవెన్యూ మిగులు చూపిస్తున్నా.. భారీ ఆర్థిక లోటు కొనసాగుతోంది.
- రాష్ట్రం ఏర్పాటైనప్పటితో పోలిస్తే మూడింతలకుపైగా రాబడి వృద్ధి నమోదైంది. పన్నుల రాబడితోపాటు పన్నేతర ఆదాయాన్నీ ప్రభుత్వం పెంచుకోగలిగింది. ఇదే సమయంలో రాష్ట్ర అప్పులు కూడా మూడింతలు పెరిగాయి.
- వ్యవసాయ ఉత్పత్తుల వృద్ధిలో రాష్ట్రం మెరుగైన పనితీరు ప్రదర్శించింది. వరి, పత్తి, పప్పుధాన్యాల ఉత్పత్తిలో దేశ సగటుకన్నా 3, 4 రెట్లకుపైగా వృద్ధి నమోదైంది. గత ఏడేళ్లలో సొంత పన్నులు, పన్నేతర ఆదాయంలో భారీ వృద్ధిని నమోదు చేసింది. 2014–15తో పోల్చితే.. 2020–21 నాటికి పన్నేతర ఆదాయం 474 శాతం, పన్నుల ఆదాయం 291 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
- 2014-15లో పన్నేతర ఆదాయం రూ.6447 కోట్లు ఉంటే.. 2020-21 నాటికి అది కాస్తా.. రూ.30600 కోట్లకు చేరుకుంది. పన్నుల ఆదాయం 201-15లో రూ.29,288 కోట్లు ఉంటే.. 2020-21 నాటికి అది కాస్తా రూ.85,300 కోట్లకు చేరింది. ఆర్థిక లోటు 2014-15లో రూ.9410 కోట్లుగా ఉంటే 2020-21 నాటికి ఆర్థిక లోటు రూ.33,191 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొంది.