చేతిలో పవర్ ఉన్నప్పుడు ఏమైనా చేయొచ్చు. అందులోకి పాలనకు కేంద్రంగా ఉండే రాజుకు కోపం వస్తే ఎలా ఉంటుందో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్పష్టం చేశాయని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొండితనం.. ఆయన పట్టుదల ఎంతలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనకు ఆగ్రహం వస్తే తట్టుకోవటం కష్టమని చెబుతారు.
తనకు నచ్చని వారి ముఖాన్ని చూసేందుకు సైతం ఆయన ఇష్టపడరు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. తాను అనుకున్న దాని కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించటం.. అందుకు అడ్డుగా ఉండే వాటిని పక్కకు తోసి మరీ నిర్ణయాలు తీసుకోవటం లాంటివి కేసీఆర్ లో కనిపిస్తుందని చెబుతారు. తాజా ఉదంతం కూడా ఈ కోవలోకే వస్తుందని చెబుతున్నారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. కొన్ని విషయాల్లో కేసీఆర్ ఎంత పట్టుదలతో ఉంటారన్నది ఇట్టే అర్థమవుతుంది. సోమవారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ 11.30 గంటలకు షురూ కాగా.. సభ మొదలైన20 నిమిషాల వ్యవధిలోనే బీజేపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. అది కూడా బడ్జెట్ సమావేశాల సెషన్ ముగిసే వరకు. ఇంతకూ అంత తీవ్రమైన వేటు ఎందుకన్న విషయంలోకి వెళితే ఆశ్చర్యపోవాల్సిందే.
బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగాన్నిప్రారంభించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పీకర్ కు పదే పదే విన్నవించుకోవటం.. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ సభ్యులు తమ స్థానాల వద్ద నిలబడి నినాదాలు చేశారు. అయినప్పటికి స్పీకర్ పట్టించుకోకపోవటంతో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి వద్దకు వచ్చి చర్చించారు. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
అప్పటివరకు జరుగుతున్న పరిణామాల్ని చూస్తున్న ఆర్ఆర్ఆర్ లు మౌనంగానే ఉన్నారు.రియాక్టు కాలేదు. అయితే.. రాజాసింగ్ సైతం కాంగ్రెస్ నేతలతో పాటు నిరసన చేపట్టారు. స్పీకర్ పట్టించుకోకపోవటంతో.. ఆయన వెల్ లోకి దూసుకొచ్చారు. ఆ వెంటనే బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు బీజేపీ సభ్యులు ముగ్గురినీ సస్పెండ్ చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ తీర్మానం ప్రవేశ పెట్టటం.. మెజార్టీ సభ్యులు దాన్ని ఆమోదించటంతో ముగ్గురిని సస్పెండ్ చేసే తీర్మానాన్ని ఆమోదించారు. వెల్ లోకి దూసుకెళ్లిన రాజాసింగ్ మీద సెషల్ మొత్తం వేటు వేయటం కూడా తప్పే అవుతుందన్న మాట వినిపిస్తోంది.
ఎందుకంటే.. గతంలో విపక్షంగా ఉన్న టీఆర్ఎస్ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి.. నానా రచ్చ చేసినప్పుడు ఒక రోజు సస్పెన్షన్ ను సైతం తెలంగాణ వ్యతిరేక చర్యగా అభివర్ణించేవారు. తాజాగా ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ పత్రిని చదివిన హరీశ్ రావు నే తీసుకుంటే.. విపక్షంలో ఉన్న వేళ ఆయన వెల్ లోకి దూసుకెళ్లటమే కాదు.. గవర్నర్ కుర్చీని కొట్టిన సందర్భాన్ని మర్చిపోలేం. ఆ రచ్చతో పోలిస్తే.. రాజాసింగ్ వెల్ లోకి దూసుకెళ్లటం అసలు విషయమే కాదన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.
అయినా.. రాజాసింగ్ వెల్ లోకి దూసుకెళితే మిగిలిన రఘు నందన్.. ఈటల రాజేందర్ ను సెషన్ పూర్తి అయ్యే వరకు వేటు వేయటం అన్నది ప్రశ్నగా మారింది. ఈటల రాజేందర్ ను సభలో కనిపించటం సీఎం కేసీఆర్ కు ఇష్టం లేదని.. ఈ కారణంతోనే అలాంటి చర్య తీసుకున్నారన్న గుసగుస గులాబీ ఎమ్మెల్యేల మాటల్లో వినిపించటం గమనార్హం. చేతిలో పవర్ ఉంటే.. ఏమైనా చేయొచ్చన్న దానికి ఇదో చక్కటి నిదర్శనంగా చెప్పొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.