కొద్ది రోజులు లేదా నెలల తేడాతో వైఎస్ జగన్ అనే ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు అందుకుని మూడేళ్లు నిండుతాయి. ఆ తరువాత ఆయన ప్రజల్లోకి పక్కాగా వెళ్తారు. ఆయన వెళ్లకున్నా మిగతా వాళ్లు వెళ్లడం అన్నది కుదరని పని. ఎందుకంటే పాలనకు సంబంధించి మిగిలి ఉన్న రెండేళ్ల కాల వ్యవధి ఆయనకు కత్తి మీద సాము. ఇప్పటిదాకా ఆయన చేసిన పనులు కొన్ని బాగున్నాయి. కొన్ని మంచి పేరు కూడా తెచ్చాయి. డబ్బులు పంచడం అన్న ఆర్థిక సూత్రం కొన్ని సార్లు మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఆ విధంగా ఒకరోజు నగదు బదిలీ లాంటివి వద్దని గగ్గోలు పెట్టిన పార్టీలే ఇవాళ డబ్బులు పంచేందుకు సిద్ధం అవుతున్నాయి.
ఆ రోజు టీడీపీ ఓ అడుగు ముందుకు వేసి నగదు బదిలీపై మాట్లాడితే విపక్షాలు గగ్గోలు పెట్టాయి. కానీ ఇప్పుడు జగన్ అమలు చేస్తున్నా లేదా చేయిస్తున్న ఆర్థిక సూత్రం కారణంగా చాలా మందికి కొంత ఊరట వచ్చింది. కరోనా లాంటి మహమ్మారుల రాక సమయంలో జగన్ పథకాలు కొంత ఆదుకున్నాయి. వీలున్నంత వరకూ ఆరోగ్యానికి పైసలు వెచ్చించాలి అన్న స్పృహ అందరితో పాటు వైఎస్ జగన్ కు కూడా వచ్చింది. దీంతో ఈ బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు బాగున్నాయి అన్న ప్రశంసను బుగ్గన రాజేంద్ర అనే ఆర్థిక మంత్రి అందుకున్నారు. కేటాయింపులకు అనుగుణంగా నిధుల విడుదల ఉంటే ఇకపై ఆయనకు ఇంకా మంచి పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా చేసేందుకు జగన్ కూడా ఆర్థిక మంత్రికి సహకరించాలి.
ఏటా యాభై ఐదు వేల కోట్ల రూపాయలను సంక్షేమం కోసమే వెచ్చిస్తున్నారు జగన్. ఇదే మాట నిన్నటి వేళ అసెంబ్లీలో చెప్పారు.అయితే సంక్షేమం ఒక్కటే పరమావధి అని ప్రథమావధి అని అనుకుంటే మిగతా పనులు మూలకు చేరుకుంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నదే ఇది. తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కొన్ని విషయాల్లో వెనుకంజలోనే ఉంది. ఆదాయంతెచ్చుకునేందుకు జగన్ కొన్ని ప్రయత్నాలు చేసినా అవి విఫలం అవుతున్నాయి. పన్నుల వసూళ్లు అన్నవి ప్రజల నుంచిమద్దతు పొందే వ్యవహారం కాదు
ఎందుకంటే రుణ మాఫీ లాంటి పథకాల అమలు వచ్చాక ఉద్దేశ పూర్వక ఎగవేతదారులే అధికంగా ఉన్న తరుణాన జగన్ ఆశించిన ఫలితాలు పన్నుల వసూళ్ల రూపంలో దక్కడం కష్టం. అయినా కూడా జగన్ కొన్ని ప్రత్యామ్నాయ దారుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విధంగా ఆదాయం సృష్టించేందుకు దారులు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని భూములు కొన్ని అమ్మకానికి ఉంచాలని భావించారు. ఇందుకు పై కోర్టు ఒప్పుకోలేదు. అదేవిధంగా సీఆర్డీఏను రద్దు చేసి పునరుద్ధరించాక రాజధాని భూములను ప్రధాన భరోసాగా ఉంచి అప్పులు తెచ్చారు. అవి కూడా చాల్లేదు.
విశాఖలో కొన్ని విలువయిన ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. అవి కూడా చాల్లేదు. ఈ దశలో జగన్ కొత్త మార్గాలు అన్వేషిస్తూ అన్వేషిస్తూ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చే దారులు వెతుకుతున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ కొంత సహకరించినా కూడా ఫలితం మాత్రం విభిన్నంగానే ఉంది. ఆదాయం సృష్టి ఒకటి పథకాల్లో నిధుల కోత ఒకటి రెండు దారులు ఉన్నాయి. ఈ ఏడాది అమ్మ ఒడి నిధులు జమ కాలేదు. అదేవిధంగా కొన్ని పథకాలు నిలుపుదల చేయాలనే అనుకుంటున్నారు. ఆ విధంగా కొంత వెసులుబాటు ఉందేమో అని చూస్తున్నారు. ఇదే దశలో ఆదాయం అంతగా లేని రాష్ట్రంనుఇంకొన్ని సమస్యలు వేధిస్తున్నాయి. కేంద్రంలో కూడా కేటాయింపులు లేవు. దీంతో అభివృద్ధి పథకాల అమలు ఊసే లేదు.
జగన్ మాత్రం సంక్షేమ నామం జపిస్తే ఫలితాలు ఉండవు. అభివృద్ధికి వస్తున్న రెండేళ్లూ ప్రాధాన్యం ఇవ్వాలి కానీ ఆయన దగ్గర నిధులు లేవు. ఈ దశలో విపక్షాల విజృంభణకే ఆస్కారం ఎక్కువ. ఓ ప్రభుత్వం అన్ని వర్గాల మన్ననలూ పొందాలి అంటే ముందు కొన్ని పనులకు అవసరం అనుకున్న వాటికి నిధులు కేటాయించాలి.ఆ పని చేయకుండా ఏ పని చేసినా ఆ ప్రభుత్వం ఆశించిన విధంగా ప్రజా దీవెనలు మళ్లీ మళ్లీ అందుకోవడం కష్టం.