ఆయ‌న 'మ‌ద్యం బాబు'.. క‌మీష‌న్ల కోసం లైసెన్సులు ఇచ్చారు: మంత్రి కొడాలి ఫైర్‌

Update: 2022-03-24 11:30 GMT
కమీషన్లకు కక్కుర్తి పడి అడ్డమైన మద్యం బ్రాండ్లను చంద్రబాబు తీసుకువచ్చారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద కొడాలి నాని మాట్లాడుతూ.. "మద్యం అమ‍్మకాలను ప్రొత్సహించింది చంద్రబాబే. మద్యం అమ్మకాల ద్వారా కమీషన్ తీసుకుని ఆస్తులు పెంచుకున్నది చంద్రబాబు. కమీషన్లకు కక్కుర్తిపడి బార్లకు ఐదేళ్లు లైసెన్లు ఇచ్చారు.

బార్లకి గతంలో కేవలం రెండేళ్లే అనుమతులు ఉండేవి.. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్నారు. అడ్డమైన బ్రాండ్లకు చంద్రబాబే అనుమతిచ్చారు.

మనం ఏం చెప్తే అది నమ్మే ప్రజలు ఉన్నారనుకునే 420 బ్యాచ్ అది. వాళ్లు తమ‌ మీడియా ద్వారా అబద్దాలు చెప్తున్నారు. సీ బ్రాండ్, ఎల్ బ్రాండ్ లకు చంద్రబాబు ఎలా అనుమతి ఇచ్చారో రాష్ట్రం అంతా చూసింది.

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. దేనికీ పనికిరాని చంద్రబాబుని అల్లుడుని చేసుకుంటే ఔరంగజేబులాగా మారాడని ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు. వెన్నుపోటు, కుట్రలు, కుతంత్రాలకు పేటెంట్ చంద్రబాబు. 175  నియోజకవర్గాలను 175 జిల్లాలను చేయమని లోకేష్ అడుగుతున్నాడు. అప్పట్లో కుప్పంని డివిజన్ చేయాలని చంద్రబాబుకు ఎందుకు అనిపించలేదు?..

ఇప్పుడు సీఎం జగన్‌కు ఎలా ఉత్తరాలు రాస్తాడు?.. కాస్తయినా చంద్రబాబుకి సిగ్గులేదా?.. అభివృద్ధి పనులను అడ్డుకుంటే టీడీపీ రాజకీయ భవిష్యత్తుకు జనం సమాధి కడతారు. ఎన్నికల వరకు ఈ 420 బ్యాచ్‌ భరించక తప్పదు" అంటూ ఆయన ఫైర్‌ అయ్యారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుగానే మద్యం నియంత్రణ గురించి చెప్పారు. అధికారం లోకి రాగానే 45 వేల బెల్టుషాపులు తొలగించారు. పర్మిట్‌ రూమ్‌లను పూర్తిగా ఎత్తివేయించారు. బార్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర‍్ణయం తీసుకుంటే టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుని నడుపుతున్నారని కొడాలి విమర్శించారు.
Tags:    

Similar News