దేశంలో ఇప్పటికే ఎంపిక చేసిన కొన్ని రూట్లలో నడుపుతున్న వందేభారత్ ట్రైన్.. ఇన్నాళ్ల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు తీసేందుకు రంగం సిద్ధమైంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటివరకు నడుస్తున్న రైళ్లలో అత్యధిక వేగంతో ప్రయాణించే తొలి ట్రైన్ గా వందే భారత్ నిలవనుంది.
మరి.. ఈ ట్రైన్ తో ప్రయాణికులకు కలిగే లాభమేంది? నష్టమేంది? అన్న విషయానికి వస్తే..
లాభాలు
- ఇప్పటివరకు ఉన్న రైళ్లలో అత్యధిక వేగంతో ప్రయాణించటం
- రెండు తెలుగు రాష్ట్రాల్లో వేగంతో ప్రయాణించే రైలు ఇప్పటివరకు ఉన్న వాటిల్లో దురంతోనే ఉంది.
- ఈ రైలు వారానికి మూడు రోజులు సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడుస్తుంది. దీని ప్రయాణ సమయం 10.10 గంటలు.
- వందే భారత్ మాత్రం అందుకు భిన్నంగా ప్రయాణ సమయం 8.40 గంటలు మాత్రమే.
- మిగిలిన రైళ్లతో పోలిస్తే మూడు నుంచి మూడున్నర గంటల పాటు సమయం ఆదా అవుతుంది.
- సికింద్రాబాద్ - విశాఖకు వెళ్లే ప్రయాణికుల్లో ఎక్కువ మంది మక్కువ చూపే గోదావరి ఎక్స్ ప్రెస్ ప్రయాణ సమయం 12 గంటలు. అదే జన్మభూమి ట్రైన్ అయితే 1.245 గంటల సమయం తీసుకుంటుంది. గరభీరథ్ అయితే 11.10 గంటలు. వీటితో పోలిస్తే వందే భారత్ కేవలం 8.40 గంటల ప్రయాణ సమయం అంటే ఎంతో టైంను ఆదా చేసినట్లే.
నష్టాలు
- వందే భారత్ ట్రైన్ లో ప్రయాణికులకు నష్టం ఏమైనా ఉందంటే.. అది కేవలం దాని టికెట్ చార్జీలు మాత్రమే.
- ఒక అంచనా ప్రకారం చైర్ కార్ ధర రూ.1750 వరకు ఉంటుందని.. ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ధర రూ.3250వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సాధారణ ట్రైన్లతో పోలిస్తే ఈ ధరలు చాలా ఎక్కువగా ఉండటమే పెద్ద మైనస్. ఉదాహరణకు గరీభ్ రథ్ విషయానికి వస్తే.. సికింద్రాబాద్ నుంచి విశాఖకు కేవలం రూ.850 లోపే ఖర్చు అవుతుంది. అది కూడా బెర్తులో ప్రయాణం. దీంతో పోలిస్తే.. వందే భారత్ ఎంత ఆర్థిక భారం అన్నది అర్థమవుతుంది.
ఎప్పుడెప్పుడు తిరుగుతుంది? షెడ్యూల్ ఎలా ఉండనుంది?
- వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రతి రోజు తిరుగుతుంది. తెల్లవారుజామున విశాఖలో బయలుదేరి.. మధ్యాహ్నానానికి సికింద్రాబాద్ చేరుకొని కేవలం 20 నిమిషాల తర్వాత మళ్లీ విశాఖకు పరుగులు తీసి రాత్రి వేళకు గమ్యస్థానానికి చేరుకోనుంది.
- ఈ రైలు సికింద్రాబాద్ లో బయలుదేరి వరంగల్, విజయవాడ, రాజమండ్రిలో మాత్రమే ఆగి ఫైనల్ గా విశాఖకు చేరుుకుంది.
- విశాఖలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరి రాజమంత్రికి 8.08 గంటలకు.. విజయవాడకు 9.50 గంటలకు వరంగల్ కు మధ్యాహ్నం 12.05 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్ కు 14.25 (మధ్యాహ్నం 2.25 గంటలకు) వస్తుంది.
- సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 14.45 (మధ్యామ్నం 2.45 గంటలకు) గంటలకు బయలుదేరి.. వరంగల్ కు 16.25 గంటలకు విజయవాడకు రాత్రి 19.10 గంటలకు, రాజమండ్రికి 21.15 గంటలకు, విశాఖకు 23.25 గంటలకు చేరుకోనుంది. మరిన్ని స్టేషన్లలో దీన్ని ఆపాలని భావించినా.. ప్రయాణ సమయం పెరుగుతుందన్న ఉద్దేశంతో తక్కువ స్టాపులకే పరిమితం చేశారు.
అన్నింటికంటే ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. అదేమంటే..
వందే భారత్ ట్రైన్ ను అధికారికంగా జనవరి 19న ప్రారంభిస్తారు. ఆ రోజు ప్రయాణికుల్ని అనుమతించరు. అయితే.. ఈ రైలును ఎప్పటి నుంచి సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతారన్నది రైల్వే అధికారులు తర్వాత ప్రకటించనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.