శిల్పా చౌదరి.. కేసుకు ముందు.. ఆ తర్వాత ఇలా.. సంచలన విషయాలు

Update: 2021-12-13 09:30 GMT
వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ శిల్పా చౌదరి, ఆమె భర్త పోలీస్ కస్డడి ముగిసింది. దీంతో ఆమె నుంచి వివరాలు సేకరించిన పోలీసులు సోమవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే విచారణ సమయంలో పోలీసులకు శిల్పారెడ్డికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. అధిక వడ్డీల ఇస్తానంటూ సంపన్న వర్గాల మహిళల నుంచి కోట్ల రూపాయలు సేకరించి శిల్పా చౌదరి దంపతులు గత కొన్ని రోజులుగా పోలీస్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. పలు కోణాల్లో పోలీసులు విచారించి వారి నుంచి అనేక విషయాలను రాబట్టారు. అయితే శిల్పా చౌదరి ముందుగా నిజం ఒప్పుకోకుండా ఆ తరువాత అసలు విషయాలను చెప్పినట్లు తెలుస్తోంది.

శిల్ఫా చౌదరి బాధితుల్లో స్టార్ హీరో సుధీర్ భార్య ప్రియదర్శిని, రేణుకారెడ్డి, దివ్యారెడ్డి ల నుంచి  శిల్పా చౌదరికి రూ.7కోట్లు సేకరించానని తెలిపింది. కానీ శిల్ప చౌదరి మాత్రం ప్రియదర్శినిపై ముందుగా అనేక ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఆ తరువాత బాధితుల నుంచి సేకరించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లు తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరి బ్యాంకు అకౌంట్లను పరిశీలించిన పోలీసులకు షాక్ తగిలింది. వారిద్దరి అకౌంట్లలో కేవలం రూ.16 వేలు, 15 వేలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఇంతమొత్తం డబ్బు ఎక్కడ పెట్టారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అమెరికాలోని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా  శిల్పాచౌదరి కొన్నాళ్లు పనిచేసింది. ఆ తరువాత ఇండియాకు వచ్చి కిట్టీ పార్టీలను స్ట్రాట్ చేసింది. ఉన్నత వర్గాల మహిళలను లక్ష్యంగా చేసుకొని వారికి అధిక వడ్డీ ఇస్తానని డబ్బలు సేకరించింది. అయితే  ఆ మొత్తాన్ని బ్యాంకులో వేయకుండా శిల్పాచౌదరి విదేశాలకు పంపారని అనుమానిస్తున్నారు. తమ మోసం ఎన్నిటికైనా బయటపడుతుందని హవాలా రూపంలో ఇతర దేశాలకు పంపినట్లు అనుకుంటున్నారు.

శిల్పా చౌదరిపై ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని, సహా మూడు కేసుల్లో రూ. 7 కోట్లకు సంబంధించిన డబ్బులు తిరిగి ఇస్తానని తెలిపింది. దీంతో ఆమె బ్యాంకు అకౌంట్లలో లేని డబ్బుఎక్కడి నుంచి తీసుకొస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాను రాధికారెడ్డి అనే మహిళకు రూ.10 కోట్లు ఇచ్చానని తెలిపింది. ఈ విషయంలో పోలీసులతో శిల్పా చౌదరి వాగ్వాదం కూడా పెట్టుకుంది. అయితే అందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం చూపలేదు. దీంతో నార్సింగ్ పోలీసులు శిల్పా చౌదరి నుంచి మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

అయితే ఇప్పటి వరకు శిల్పా చౌదరి రూ.32 కోట్ల వరకు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తాను సెలబ్రెటీగా, సోషలైట్ గా ప్రచారం చేసుకున్న శిల్పా సంపన్న వర్గాల మహిళలను టార్గెట్ చేసి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసింది. అయితే పోలీసుల వివచారణలో రోజుకో రకమైన సమాచారాన్ని ఇచ్చింది. దీంతో ఆమె చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అకౌంట్లలో ఏమాత్రం డబ్బు జమచేయని శిల్పా దంపతులు తమ డబ్బు ఎవరికి ఇచ్చారోనన్న కోణంలో పోలీసులు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. అయితే ఒకరోజు ఆమె తన డబ్బంతా హాస్పిటల్ నిర్మాణానికి ఇచ్చినట్లు చెబుతున్నా.. అది నిజమా..? కాదా..? అన్న విషయంపై నిర్దారణకు రాలేకపోతున్నారు. మరోవైపు తనను కూడా కొంత మంది మోసం చేశారని శిల్పా చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా సుధీర్ బాబు సతీమణి ప్రియదర్శినికి తాను కోట్ల రూపాయలను అధిక వడ్డీకి తీసుకున్నానని తెలిపింది. అయితే ఆ విషయంపై పోలీసులు తరువాత విచారించే అవకాశం ఉందని అంటున్నారు.
Tags:    

Similar News