కరోనా మానవ నిర్మితమేనని అమెరికా పరిశోధనల్లో తేలిందా..!

Update: 2022-12-06 12:30 GMT
కరోనా వైరస్ ప్రపంచానికి పరిచయమై మూడేళ్లు గడిచిపోయింది. ప్రస్తుతం నాలుగో ఏడాదిలో కరోనా వైరస్ తో మానవాళి ప్రయాణం కొనసాగిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. కరోనా ధాటికి మనుషులు పిట్టల్లా రాలి పోయారు. ఈ భయానక పరిస్థితుల నుంచి యావత్ ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.

సైంటిస్టుల విశేష కృషి ఫలితంగా కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయనప్పటికీ కరోనా వేరియేంట్ల రూపంలో ప్రతి దాడి చేసింది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ క్రమంగా తన బలాన్ని కోల్పోవడంతో ప్రస్తుతం కరోనా కేసులు అన్ని దేశాల్లోనూ తగ్గుముఖం పట్టాయి. అయితే తొలి నుంచి కరోనా వైరస్ చైనా సృష్టేనని వాదనలు వినిపిస్తున్నాయి.

గత మూడేళ్లుగా కరోనా వైరస్ ప్రయోగాలు చేస్తున్నప్పటికీ దీని మూలలను కనుగోనడంలో మాత్రం మిస్టరీ మాత్రం వీడటం లేదు. దీంతో ఈ వైరస్ మానవ సృష్టేనని అనుమానాలు మరింత బలపడుతున్నాయి. తాజాగా ప్రముఖ అమెరికన్ ఎపిడమాలజిస్ట్ ఆండ్రూ హఫ్స్ ‘ది ట్రూత్ అబౌట్ వూహాన్’ అనే పేరుతో ఓ పుసకాన్ని విడుదల చేశారు. ఇందులో పలు సంచలన విషయాలను ఆయన వెల్లడించారు.

ఈ పుస్తక సారాంశాన్ని ‘ది సన్ ’ పత్రిక ‘‘వ్యూహన్ ల్యాబ్ నుంచే కోవిడ్ లీకైందని’’ వెల్లడించింది. విదేశీ ల్యాబ్ లలో బయో సేఫ్టీ.. రిస్క్ మేనేజ్మెంట్ వంటి నియంత్రణ చర్యలు సరిగా లేకపోవడమే వైరస్ లీక్ అవడానికి దారితీసిందని ఆండ్రూ హఫ్స్ పేర్కొన్నారు. కోవిడ్ జన్యుపరంగా తయారు చేసిందనే విషయం చైనాకు ముందు నుంచి తెలుసని పేర్కొన్నారు.

చైనాలోని పరిస్థితులను చూసి తానెంతో భయపడి పోయానని.. మనమే ఈ ప్రమాదకరమైన జీవాయుధ సాంకేతికను చైనాకు బదిలీ చేస్తున్నామంటూ అమెరికాను ఉద్దేశించి ఆండ్రూ హఫ్స్ తన కథనంలో రాసుకొచ్చారు.ఇక గతంలో అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) సంస్థ చైనాలోని వ్యూహాన్ వైరాలజీ ల్యాబ్ తో కలిసి పని చేసింది.

కాగా వ్యూహన్ ల్యాబ్ లో పని చేసిన ఓ ప్రముఖ అమెరికన్ ఎపిడమాలిస్టు సైతం వైరస్ ఇక్కడి నుంచే లీకైందని గతంలో ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఈ నేపథ్యంలోనే నాటి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎన్ఐహెచ్ కు నిధులను నిలిపివేశారు. కాగా ఆండ్రూ హఫ్స్ గతంలో న్యూయార్క్ లోని ఎకో హెల్త్ అలయన్స్ కు ఉపాధ్యక్షుడిగా పని చేశారు.
Tags:    

Similar News