దేశంలో హైదరాబాద్ మహానగరం రూపురేఖలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటివరకు ఒక లెక్క..ఇప్పుడు నడుస్తున్నది మరో లెక్కన్నట్లుగా మారినట్లు చెబుతున్నారు. గతానికి భిన్నంగా హైదరాబాద్ మహానగరం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. దేశంలో ఎవరికి ఎక్కడ ఆస్తులు ఉన్నా.. హైదరాబాద్ లో మాత్రం ఏదో ఒక ఆస్తి ఉండటం చాలా అవసరమన్నట్లుగా పరిస్థితి మారుతోంది.
దీనికి తగ్గట్లే తాజాగా విడుదలైన నివేదికలో ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం దేశంలో అత్యంత ధనికులు ఉన్న మహానగరాల్లో ముంబయి తర్వాతి స్థానం హైదరాబాద్ దేనని తేల్చారు. ముంబయి మొదటి స్థానంలో ఉంటే.. హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. దీనికి సంబంధించిన గణాంకాలను తాజాగా నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్టు 2022 వెల్లడించింది.
2021లో నికర ఆస్తి విలువ 30 మిలియన్ డాలర్లు.. అంతకంటే ఎక్కువగా ఉన్న వారిని అత్యంత ధనికులుగా పేర్కొన్నారు. 30 మిలియన్ డాలర్లు అంటే మన రూపాయిల్లో దగ్గర దగ్గర రూ.227 కోట్లు. ఇలాంటి వారు ముంబయిలో 1596 మంది ఉంటే.. హైదరాబాద్ లో 467 మంది ఉన్నారు. 2026 నాటికి హైదరాబాద్ లో ఇలాంటి సంపన్నుల సంఖ్య 728 మందికి చేరుతుందని అంచనా వేసింది.
గత ఐదేళ్లలో హైదరాబాద్ లో అత్యంత ధనికుల సంఖ్య 314 నుంచి 48.7 శాతం పెరిగి 467కు పెరిగినట్లుగా వెల్లడైంది. దేశ వ్యాప్తంగా చూస్తే.. అత్యంత ధనికులు 2020లో 12,287 మంది ఉంటే.. 2021లో అది కాస్తా 13,637కు చేరినట్లుగా నివేదికలో వెల్లడైంది.
2026 నాటికి దేశంలో వీరి సంఖ్య 19,006కు పెరిగే అవకాశం ఉందని లెక్కలు వేసింది.అంతేకాదు.. సంపన్నులు అత్యధికంగా ఉన్న నగరాల్లోని వారు..పెట్టుబడులను ఎక్కడ పెడుతున్నారు? దేనిలో మదుపు చేస్తున్నారన్న విషయాన్ని వెల్లడించింది.
దేశంలోని అత్యంత ధనవంతులు ఇళ్లు.. వాణిజ్య భవనాలు.. ఆఫీసు స్థలాల కొనుగోలుతో పాటు ఈక్విటీలు.. రీట్స్ లో పెట్టుబడులు పెడుతున్నారు. తమ సొమ్ములో దాదాపు 60 శాతం మొత్తాన్ని స్థిరాస్థిలోనే ఉంచుతున్నారట. ఇటీవల క్రిప్టోకరెర్సీ.. నాన్ ఫంజిబుల్ టోకెన్స్ లోనూ పెట్టుబడులు పెడుతున్నట్లుగా పేర్కొన్నారు. కళాఖండాలు.. ఆభరణాలు.. ఖరీదైన కార్లు.. వాచ్ లు.. హ్యాండ్ బ్యాగుల కొనుగోలు మీద ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లు వెల్లడైంది.