ఇటీవల కాలంలో ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటోంది. ఒక్క వ్యక్తి ఒక్క ఫోన్ వాడుతున్నారు. కరోనా పుణ్యమా అని పిల్లలకు చేతుల్లోకి కూడా ఫోన్లు వచ్చేశాయి. ఆఫీస్ పనుల్లో తల్లిదండ్రులు పిల్లల ఆన్ లైన్ తరగతుల కోసం ప్రత్యేక ఫోన్లను కొన్నారు. ఇక వాటినే పిల్లలు వాడటం గమనార్హం.
ఈ నేపథ్యంలో పాఠశాలకు ఫోన్లతో వస్తున్న చిన్నారుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అయితే స్కూల్లో ఫోన్ అనుమతి లేదంటూ ఉపాధ్యాయులు వారించినా... కొందరు తీసుకువస్తున్నారు. దాంతో ఆగ్రహించిన ఓ టీచర్... విద్యార్థుల ఫోన్లను లాగి కాల్చేశారు.
ఫోన్లను పాఠశాలకు తీసుకు రాకూడదంటే విద్యార్థులు వినడం లేదని ఆ టీచర్ కు కోపమొచ్చిందేమో. తరగతి గదిలో విద్యార్థుల వద్ద ఉన్న ఫోన్లలను కలెక్ట్ చేశారు. అయితే క్లాస్ తర్వాత మేడం మళ్లీ ఇస్తుందని భావించిన... స్టూడెంట్ ఆమె చేతికి ఇచ్చారు. అయితే ఊహించిన దానికన్నా ఎక్కువ ఫోన్లు ఉండడంతో ఆ టీచర్ కు చిర్రెత్తుకొచ్చింది... వాటన్నింటిని తీసుకొని పోయి.. ఓ కుండీలో వేసి తగలబెట్టారు. ఖరీదైన ఫోన్లు... మంటల్లో కాలి బూడదవుతుంటే ఏమీ చేయలేక ఆ విద్యార్థులు అలాగే చూస్తుండిపోయారు.
ఇండోనేషియాలోని ఓ బోర్డింగ్ స్కూల్ లో ఈ సంఘటన జరిగింది. ఎంత చెప్పినా విద్యార్థులు రోజూ ఫోన్లు తీసుకువస్తున్నారని టీచర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ అనుకోని అన్ని తరగతుల్లోని విద్యార్థుల వద్ద ఉన్న ఫోన్ల ను లాగేసుకున్నారు. అయితే తొలుత విద్యార్థులు ఇలాంటి పరిణామం జరుగుతుందని ఊహించలేదు. అందుకే తమ ఫోన్లు భద్రంగా టీచర్ చేతిలో పెట్టారు. ఇంకేం.. బడికి వచ్చి పాఠాలు చదువుకోవాల్సిన పిల్లల వద్ద ఈ మాయాదారి ఫోన్లు ఎందుకంటూ టీచర్ కు మహా కోపం వచ్చింది. పిల్లలు ఫోన్ తీసుకురావాలంటే భయపడేలా చేయాలని భావించారు.
విద్యార్థుల వద్ద ఉన్న ఫోన్లు కలెక్ట్ చేశారు. పాఠశాల ఆవరణలో ఓ కుండీ ఏర్పాటు చేశారు. దానిలో మంట పెట్టి... పదుల సంఖ్యలో ఫోన్లను కాల్చేశారు. వాటిలో ఖరీదైన ఫోన్లు ఉండడం గమనార్హం. టీచర్ ఫోన్లను తగలబెడుతంటే విద్యార్థులు వద్దని వేడుకున్నారు. ప్లీజ్ మేడం... ఇంకోసారి తీసుకురాము అంటూ విజ్ఞప్తి చేశారు.
అయినా కూడా ఆ టీచర్ వినలేదు. ఫోన్లన్నీ పూర్తిగా కాల్చేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. కాగా నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. టీచర్ చేసిన పనిని కొందరు సమర్థిస్తుంటే.... మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు. బడికి వచ్చే పిల్లలకు ఫోన్ల్ ఎందుకని కొందరు అంటుంటే... నిర్ధాక్షిణ్యంగా ఫోన్లు కాల్చేస్తారా? అంటూ మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Full View