కర్ణాటకలో మొదలైన హిజాబ్ రచ్చకు శుభం కార్డు పడటం లేదు. ఈ రచ్చకు చెక్ పడినట్లే కనిపిస్తున్నప్పటికీ అదే సమయంలో మళ్లీ వార్తల్లోకి ఎక్కుతోంది.
తాజాగా హిజాబ్ వివాదంపై కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు ముఖరం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిజాబ్‌ను వ్యతిరేకించే వారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తానని ఖాన్ హెచ్చరించాడు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అవడంతో కర్ణాటక పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతున్న తరుణంలో కలబురాగిలో నిర్వహించిన ఓ సమావేశానికి ముఖరం ఖాన్ హాజరై ప్రసంగించారు. `ఏదో ఒక రోజు మనమంతా చనిపోయేవాళ్లమే. ఇంత దానికి మతాలను అంటగట్టడం సరికాదు. అన్ని కులాలు, మతాలను సమానంగా చూడాలి. మీరు ఏదైనా ధరించొచ్చు. మిమ్మల్ని ఎవరైనా అడ్డగిస్తే.. ఊరుకునే సమస్య లేదని, ఇలాంటి చర్యలను సహించబోం`` అని ముఖరం ఖాన్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా హిజాబ్ గురించి ప్రస్తావించారు. ``హిజాబ్‌ను వ్యతిరేకిస్తే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఇక్కడే పుట్టాం.. ఇక్కడే చచ్చిపోతాం.. జీవితం ఉన్నంత వరకు ఇండియన్‌గానే బతకాలి.
ఎవరైతే హిజాబ్‌ను వ్యతిరేకిస్తున్నారో వారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను`` అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ` ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలాఉండగా, హిజాబ్ వివాదం నేపథ్యంలో హుబ్లీ – ధార్వాడ్‌లో పోలీసులు ఈ నెల 28 వరకు విద్యాసంస్థలకు 200 మీటర్ల పరిధిలో సెక్షన్ 144ను అమలులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు సీపీ లాభూరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు జంటనగరాల పరిధిలో పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు 200 మీటర్ల దూరంలో గుమిగూడడం, ఆందోళన, నిరసన కార్యక్రమాలపై నిషేధం ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.