అధికారంలోకి వస్తే ‘ప్రగతి భవన్’ను అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ చేస్తా: రేవంత్ రెడ్డి
రెండు సార్లు అధికారంలో ఉన్న కేసీఆర్ మూడోసారి కాలేరని.. ఆయనపై వ్యతిరేకత బాగా ఉందని ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు బలంగా నమ్ముతున్నాయి. అందుకే ఓవైపు రేవంత్ రెడ్డి, మరోవైపు బండి సంజయ్ లు దూకుడుగా ముందుకెళుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్న దానిపై రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
తెలంగాణ సీఎం అధికారిక నివాసం ‘ప్రగతి భవన్’ను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ గా మారుస్తామని .. తొలిసంతకం దానిపైనే పెడుతామని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తనను ఎంపీ పదవికి రాజీనామా చేయాలని టీఆర్ఎస్ నేతలు సవాల్ చేస్తున్నారని.. దమ్ముంటే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ తప్పకుండా ముందస్తు ఎన్నికలకు వస్తారని.. కాంగ్రెస్ శ్రేణులు సంసిద్ధంగా ఉండాలని రేవంత్ పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధైర్యం లేక పీసీసీ అధ్యక్షుడిగా తాను ఎంపికకాగానే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని గద్దెనెక్కిన కేసీఆర్.. తన ఇంట్లో అందరికీ ఉద్యోగాలు కల్పించుకున్నారని ఆఱోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ప్రగతి భవన్ ను అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ గా మార్చి 12 నెలల్లోపే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలనే డిమాండ్ తో గాంధీభవన్ లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు. నిరసన దీక్షను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ చేపట్టారు. పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రారంభించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు హాజరై దీక్షను విరమింపచేశారు.
నీళ్లు-నిధులు-నియామకాలే ప్రధాన ఎజెండాగా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తే.. ఒక్క కేసీఆర్ ఇంట్లోనే ఉద్యోగాలు వచ్చాయని ఆరోపించారు. ఏడేళ్ల కాలంలో లక్షకుపైగా ఉద్యోగాలు కల్పించి ఉంటే బిశ్వాల్ కమిటీ ప్రకారం.. లక్షా 90వేల ఖాళీలు ఎందుకయ్యాని ప్రశ్నించారు.