#RussiaUkrainewar: 5 రష్యా విమానాలు కూల్చివేత.. వెనక్కి మళ్లిన భారత విమానం!
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య భీకరపోరు సాగుతోంది. ఒక్కసారిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించి యుద్ధానికి దిగారు. బాంబుల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ కు అమెరికా, యూరప్ దేశాలు సహకారం అందిస్తున్నాయి. ప్రతిదాడికి కూడా ఉక్రెయిన్ సిద్ధమైంది.
గురువారం ఉదయం నుంచే రష్యా ఉక్రెయిన్ పై క్షిపణి దాడులతో రెచ్చిపోయింది. ఓవైపు పలు అగ్రదేశాల హెచ్చరికలు జారీ చేస్తున్నా ఇవేమీ పట్టించుకోని పుతిన్.. ఉక్రెయిన్ లో పై దాడులకు తెగబడ్డారు. ప్రధానంగా అక్కడి మిలటరీ స్థావరాలు, డిఫెన్స్ స్థావరాలే టార్గెట్ గా రష్యా క్షిపణులు ప్రయోగిస్తోంది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? అన్న అనుమానాలు లేకపోలేదు. ఉక్రెయిన్ కు యూరప్, అమెరికా మద్దతు ఉంది. ఇక రష్యాకు చైనా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఇప్పటికే రష్యా బలగాలు ఉక్రెయిన్ సరిహద్దులు దాటి ఆ దేశంలోకి ప్రవేశించినట్టు ఆ దేశ అధికారిక మీడియా ప్రకటించింది.
అయితే రష్యా మాత్రం ఉక్రెయిన్ మిలటరీ స్థావరాలు, డిఫెన్స్ స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నామని ప్రకటించారు. తాము సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాల జోలికి వెళ్లలేదని స్పష్టం చేసింది. ఇక రష్యా క్షిపణులు ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లో బీభత్సాన్ని సృష్టించినట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
-ఐదు రష్యా విమానాలను కూల్చేసిన ఉక్రెయిన్
ఇక రష్యాకు ఉక్రెయిన్ ధీటుగా బదులిస్తోంది. రష్యాకు చెందిన ఐదు యుద్ధ విమానాలను , ఒక హెలిక్యాప్టర్ ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. దీంతో రష్యా మరింతంగా రెచ్చిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్ లోని కివ్, ఖర్కివ్ నగరాలపై రష్యా భీకర దాడులు చేస్తోంది.
ఇక రష్యా యుద్ధం ప్రకటించడంతో ఉక్రెయిన్ లో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకునేందుకు పరుగులు తీశారు. ఇక వివిధ దేశాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా ప్రభుత్వాలు విన్నవించాయి.
-ఎయిర్ స్పేస్ పై ఉక్రెయిన్ నిషేధం.. భారత విమానం వెనక్కి..?
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించడంతో ఉక్రెయిన్ దేశం తమ ఎయిర్ స్పేస్ ను మూసేసింది. రష్యా యుద్దం ప్రారంభించిన నేపథ్యంలో ఎయిర్ పోర్టులను, గగనతలాన్ని మూసివేస్తూ ఉక్రెయిన్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు ఆ దేశ రాజధాని కీవ్ కు బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానం వెనుదిరిగింది. ఇప్పటికే ఉక్రెయిన్ నుంచి ఇండియా మన దేశ పౌరులను తరలిస్తోంది. 182 మంది పౌరులు ఈ ఉదయం ఢిల్లీలో దిగారు. ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. గగనతలాన్ని ఉక్రెయిన్ మూసివేయడంతో అక్కడి భారతీయులను ఎలా తీసుకురావాలని భారత అధికారులు చర్చిస్తున్నారు.
ఉక్రెయిన్ నుంచి సాధారణ విమానాల రాకపోకలను నిషేధించడంతో ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటుందని భారత ప్రభుత్వం తెలిపింది. ఈ యుద్ధం లో భారత ప్రభుత్వం ఎవరికి మద్దతు ఇవ్వదని.. తటస్థంగా ఉంటుందని తేల్చింది.