బీఫాం ఇచ్చేందుకు చంద్ర‌బాబు మెలిక పెడుతున్నారా?

Update: 2022-02-18 03:34 GMT
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ అనూహ్య‌మైన ఆలోచ‌న‌లు చేస్తోంది. చంద్ర‌బాబు శ‌ప‌థం మేర‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యంద‌క్కించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే.. దీనిని సాదించాలంటే.. అంత ఈజీకాదు.. చాలా ప్లాన్ అవ‌స‌రం.. ఇప్పుడు ఈ దిశ‌గానే చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నార‌నేటాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌లు.. అంత ఈజీగా ఉంద‌నే చ‌ర్చ కొన్నాళ్లుగా సాగుతొంది. వైసీపీని ఎదుర్కొనేందుకు.. చంద్రబాబు చాలా క‌ష్ట‌ప‌డాల‌నే సంకేతాలు కూడావ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు కూడావ‌చ్చే ఎన్నినక‌ల్లో వ్య‌వ‌హ‌రించే తీరుపై చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

ముఖ్యంగా గ‌తంలొ రెండుసార్లు ఓడిపోయిన‌నియోజ‌క‌వ‌ర్గాల‌ను చంద్ర‌బాబు ప‌సిగ‌ట్టి.. వాటిని.. ఈసారి రపీట్ కాకుండా.. చూసుకోవాల‌ని చంద్ర‌బాబుభా విస్తున్నారు. ఈ క్ర‌మంలో వ‌రుస ప‌రాజ‌యాలు సాధించ‌ని వారికి చంద్ర‌బాబు చెక్ పెట్టాల‌ని నిర్ణ‌యించారు. వాస్త‌వానికి.. 2014లో విజ‌యం సాధించిన వారు..ఉన్నారు. అదేస‌మ‌యంలో ఓడిపోయిన‌వారు కూడా ఉన్నారు. అదేస‌మయంలో 2019 ఎన్నిక‌ల్లో నూ.. ఇదే జ‌రిగింది. అయితే.. రెండు ఎన్నిక‌ల్లో వ‌రు స‌గాఓడిపోయిన వారికి చెక్ పెట్టాల‌ని చంద్ర‌బాబు నిర్న‌యించుకున్నార‌నే టాక్ టీడీపీలో వినిపిస్తోంది.

2014లో నిజంగా.. టీడీపీ.. అటుబీజేపీతోను.. ఇటు జ‌న‌సేన‌తోనూ పొత్తు పెట్టుకుంది.  ఈ నేప‌థ్యంలోనే అధికారంలోకివ‌చ్చింది. అయితే.. ఇంత పొత్తు పెట్టుకున్నా కూడా చాలా మంది నాయ‌కులు విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు. ఇక‌, 2019లో ఒంట‌రి పోరులో కేవ‌లం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీకి మిగిలారు. దీనిని బ‌ట్టి వ్య‌క్తిగ‌త ఇమేజ్ క‌న్నా కూడా పార్టీపై ఆధార‌ప‌డిన వారు ఎక్కువ మంది ఉన్నార‌ని.. తేలిపోయింది. పోనీ..ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టినా.. 2019లో జ‌గ‌న్ వేవ్ ఉంది.. ఆయ‌న పాద‌యాత్ర ఫ‌లితం కార‌ణంగా.. వైసీపీ వైపు జ‌నాలు మొగ్గు చూపార‌ని అనుకున్నా..ఇప్పుడు ప్ర‌భుత్వంపై మాత్రం వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో 2024 ఎన్నిక‌ల్లో మాత్రం టీడీపీని బ‌లోపేతం చేసేందుకు చంద్ర‌బాబు అనూహ్య‌మైన వ్యూహాన్ని అనుసరించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వ‌రుస‌గా రెండు సార్లు ఓడిపోయిన నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టాల‌నిచంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తొంది. ఇదే విష‌యం స్థానికంగా కూడా చ‌ర్చ‌గా మారింది. `` వాళ్లు రెండు సార్లు ఓడిపోయారు సార్‌.. ప‌వ‌న్ వంటి దిగ్గ‌జాలు ప్ర‌చారం చేసినా.. త‌మ స‌త్తా చూపించలేక పోయారు. ఇప్పుడు.. మ‌ళ్లీ ఎందుకు సార్‌``అనే కామెంట్లు టీడీపీలో  వినిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే 2024 ఎన్నిక‌ల్లో కొత్త‌వారికి అవ‌కాశం ఇవ్వాల‌ని చంద్ర‌బాబు చూస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. 2016-17 మ‌ధ్య వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మేల్యేలు గెల‌వ‌లేదు. ఒక్క గొట్టిపాటి ర‌వి(అద్దంకి) త‌ప్ప‌.. ఇంకెవ‌రూ గెల‌వ‌లేదు. ఈ నేప‌థ్యంలో వారికికూడా టికెట్లు ఇవ్వ‌ద్ద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకోని వారికి టికెట్లు ఇవ్వ‌రాద‌ని టీడీఈ అధినేత నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌చ్చే మార్పుల‌ను బ‌ట్టి.. అంటే.. బీజేపీతోను.. జ‌న‌సేన‌తోనూ.. టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. అప్పుడు ఉన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి.. పార్టీ వ్యూహం మార్చుకునే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలోనే టీడీపీ సీట్లు ఆశించేవారికి ద‌డ‌పుడుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ విష‌యంలో చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News