పోరు తెలంగాణ : మళ్లీ తెర‌పైకి అమ‌రుల క‌థ

Update: 2022-02-17 01:10 GMT
పొడుస్తున్న పొద్దు మీద న‌డుస్తున్న కాల‌మా..పోరు తెలంగాణ‌మా..వీర తెలంగాణమా..కత్తుల కోలాట‌మా..నెత్తుటి ఆరాట‌మా..అని రాశారు గ‌ద్ద‌ర్. ఆ విధంగా ఎలుగెత్తి పాడారు గ‌ద్ద‌ర్.. కానీ ఇప్పుడు అమ‌రుల గానం ఎక్క‌డాలేదు.అమ‌రుడి పేరే ఊసులో లేదు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక త్యాగ‌ధ‌నుల కుటుంబాల‌కు ఆద‌రువు ద‌క్కిందీ లేదు.ఆదుకున్న‌దీ లేదు.కానీ చాలా కాలానికి రాజ‌కీయ ప్ర‌యోజ‌న‌మే ప‌ర‌మావ‌ధిగా ఓ క‌థ ప్రారంభం అయింది.ఆ క‌థలో హీరో కేసీఆర్ కావొచ్చు. ఆ క‌థ‌కు విల‌న్ బీజేపీ కావొచ్చు..ఇదీ టీఆర్ఎస్ న‌డుపుతున్న క‌థ‌.అస‌లు వ్య‌వ‌సాయ మీట‌ర్ల‌తో ఈ క‌థ మొద‌లుపెట్టారు. కానీ  సంబంధిత చ‌ట్టంలోనో లేదా సంబంధిత ఉపాంశంలోనో ఎక్క‌డా కూడా విద్యుత్ మీట‌ర్ల ఏర్పాటుపై అస్స‌లు ప‌ట్టుబ‌ట్టిన దాఖ‌లాలే లేవు అని కేంద్రం తేల్చింది.అలాంట‌ప్పుడు కేసీఆర్ మాత్రం ఎలా అంటారు విద్యుత్ మీట‌ర్లు పెట్ట‌మ‌ని కేంద్రం ఒత్తిడి తెస్తుంద‌ని?

కానీ ఒక్క‌టి వాస్త‌వం ఇప్ప‌టికిప్పుడు రాష్ట్రాల విష‌య‌మై కేంద్ర మ‌న‌సు మార్చుకుంటే మార్చుకోవ‌చ్చు కానీ వ్య‌వ‌సాయ మోట‌ర్ల‌కు మీట‌ర్ల బిగింపు అన్న‌ది శ్రీ‌కాకుళం నుంచి పైలెట్ ప్రాజెక్టు కింద ఎప్పుడో ప్రారంభం అయిపోయింది.

ఇందుకు సంబంధించిన నిధులు కూడా ఎప్పుడో ఏపీ స‌ర్కారు అందుకుంది.అయినా కూడా స‌మాఖ్య స్ఫూర్తి కి విఘాతం ఇచ్చే విధంగానే ఈ నిర్ణ‌యం ఉంది అని అంతా గగ్గోలు పెట్టాక విద్యుత్ సంస్క‌ర‌ణల అమ‌లు విష‌య‌మై మ‌న‌సు సంబంధిత ఆలోచ‌న మార్చుకున్నారా?

ఇక అమ‌రుల స్థూపం ముట్టుకునే అర్హ‌త కిష‌న్ రెడ్డి (కేంద్ర‌మంత్రి)కి లేద‌ని అంటున్నారు హరీశ్.ఇదే స‌మ‌యంలో ఆయ‌నేమ‌న్నారో చూద్దాం.."ఆ వేళ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌లో భాగంగా సంబంధిత ఉద్య‌మ కారులు, ప్ర‌జా సంఘాలు తెలంగాణ ఎమ్మెల్యేలూ,ఎంపీలూ త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశాయి.టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎంపీలు రాజీనామా చేశారు.యెండ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ రాజీనామా చేశారు.కిష‌న్ రెడ్డి రాజీనామా చేయ‌కుండా ప‌ద‌విని ప‌ట్టుకున్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డ‌లేదు. జై ఆంధ్రా ఉద్య‌మానికి నాయ‌క‌త్వం వ‌హిస్తాన‌ని, 2011 డిసెంబ‌ర్ 8న కిష‌న్ రెడ్డి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ట్వీట్ చేశారు. తెలంగాణ సాధ‌న కోసం రాజీనామా చేయ‌కుండా ముఖం చాటేసి... ఇవాళ సిగ్గులేని మాట‌లు మాట్లాడుతున్నారు. తెలంగాణ స‌మాజానికి వెన్నుపోటు పొడిచారు.యెండ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ‌ను గెలిపించుకునే ప‌రిస్థితి నీకు లేదు.సొంత పార్టీ కాక‌పోయినా తెలంగాణ కోసం కేసీఆర్ యెండ‌ల‌ను గెలిపించారు.అమ‌రుల గురించి మాట్లాడే నైతిక‌త కిష‌న్ రెడ్డికి లేదు" అని హ‌రీశ్‌రావు అన్నారు.

ఇదంతా బాగుంది కానీ ఇప్పుడు నాటి ప‌రిణామాలు త‌వ్వి కిష‌న్ రెడ్డి ఇమేజ్ త‌గ్గిస్తారా లేదా పెంచుతారా? ఏమో !రేప‌టి వేళ కార్మిక శాఖ మంత్రిగా ఉన్న‌ప్పుడో లేదా మ‌రో చోట మ‌రో ప‌ద‌విలో ఉన్న‌ప్పుడో కేసీఆర్ కానీ మీరు కానీ చేసిన అవినీతి భాగోతం వెల్ల‌డిలోకి తెస్తే ఏమౌతారని? నిన్న‌టిదాకా ఉన్న స‌ఖ్యత ఇప్పుడు పోయిందా? లేదా వ‌సంత్ విహార్ (ఢిల్లీలో ఖ‌రీద‌యిన ప్రాంతం)లో తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణానికి స్థ‌లం తీసుకున్నాక బీజేపీ తో ప‌ని అయిపోయింద‌ని వ‌దిలేశారా?అని ఎదురు ప్ర‌శ్నిస్తూ హ‌రీశ్ ను కేసీఆర్ ను నిల‌దీస్తుంది బీజేపీ.

ఇక ఈ యుద్ధం ఎన్నిక‌ల వ‌ర‌కూ కొన‌సాగ‌డం ఖాయం. బీజేపీయేతర శ‌క్తుల క‌లుపుకుని ప్ర‌జా ఫ్రంట్ ఏర్పాటుచేయాల‌న్న ఆలోచ‌న‌లో భాగంగా వ‌స్తున్న తిట్లూ మ‌రియు శాప‌నార్థాలుఎంత కాలం ఉంటాయో అన్న‌ది కేసీఆరే తేల్చాలిక‌! ఇవ‌న్నీ స‌రే తెలంగాణ వీరుల సంగ‌తేంటి వాళ్ల‌ను ఇప్పుడ‌యినా ఆదుకునేదెవ్వ‌ర‌ని!
Tags:    

Similar News