ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో శనివారం జరిగిన రెండో విడత(తుది) అసెంబ్లీ ఎన్నికలు హింసాత్మకగా మారాయి. ఒకవైపు ఉదయం 7 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా,... మరోవైపు.. బీజేపీ నేతపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపారు. ఈ ఘటనలో బీజేపీ నేత అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అయినప్పటికీ పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహించారు.
ఓటింగ్ ప్రారంభమైన కొన్ని నిముషాలకే బీజేపీ కార్యకర్తపై కాల్పులు జరగడం కలకలం రేపింది. ఈ ఘటనలో బీజేపీ నేత అముబా సింగ్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ వర్గాలు ఆరోపించాయి.
పోలింగ్కు ముందు ప్రచారం నిర్వహించవద్దని కాంగ్రెస్ నేత ఇంటికి.. అముబా సహా బీజేపీ కార్యకర్తలు వెళ్లిన సమయంలో ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అముబాపై కాల్పులు జరిగాయని సమాచారం. మరో ఘటనలో బీజేపీ బహిష్కృత నేత ఇంటి వద్ద బాంబు దాడి జరిగింది.
మరోవైపు ఇన్ని ఘటనల నేపథ్యంలోనే మణిపుర్ అసెంబ్లీకి చివరిదైన రెండో దశ పోలింగ్ ముగిసింది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య.. ఆరు జిల్లాల్లోని 22 నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 67.77 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది.
కాంగ్రెస్ నేత, మాజీ సీఎం ఓ ఇబోబీ.. పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఒకట్రెండు సీట్లు తగ్గినా.. ఇతర పార్టీలతో జట్టుకట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
రెండో విడత పోలింగ్లో మొత్తం 92 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1,247 పోలింగ్ స్టేషన్లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ నియోజకవర్గాల్లో 8.38 లక్షల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. ఫిబ్రవరి 28న రాష్ట్రంలో తొలి దశ పోలింగ్ పూర్తైంది. పలు అవాంఛనీయ ఘటనలు, హింస మధ్య ఆ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఏకంగా కాల్పులు మరణాలు నమోదు కావడం గమనార్హం.