దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తున్నట్టే కనిపిస్తోంది. రానున్న రోజుల్లో కోవిడ్ నుంచి దేశానికి పూర్తి విముక్తి కలుగబోతోందని తెలుస్తోంది. దేశం కరోనా నుంచి బయటపడుతుందని పరిశోధకులు అంటున్నారు. కొత్త కేసుల నమోదు భారీగా తగ్గింది. పాజిటివిటీ రేటు 5శాతం దిగువకు చేరి 4.5 శాతానికి తగ్గడం ఊరటనిస్తోంది.
దేశంలో ఈరోజు 2685 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ దేశంలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 4,31,50,215కు చేరుకుంది. ఇదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య 16308కి పెరిగింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ డేటా ప్రకారం.. ఇవాళ 33 మరణాలు నమోదయ్యాయి. దాంతో కోవిడ్ మరణాల సంఖ్య 5,24,572కి చేరింది. డేటాను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు స్థిరంగా తగ్గుతూ వస్తున్నాయని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. 2020తో పోలిస్తే చాలా తక్కువగా ఉందని కోవిడ్ మహమ్మారి ముగింపు దశకు చేరుకుందని అంచనా వేస్తున్నారు.
2020 ప్రారంభం నుంచి మన దేశంలో 4.24 కోట్ల మందికి కరోనా సోకింది. వారిలో 4.10 కోట్ల (96.70 శాతం) మంది వైరస్ నుంచి బయటపడ్డారు. కోవిడ్ తో బాధపడుతున్న వారి సంఖ్య 8,92,828 (2.11 శాతం)గా ఉంది. 5,05,279 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తెలిపింది.
ఇక కరోనా సెకండ్ వేవ్ భారత్ ను ఊహించిన విధంగా దెబ్బతీసింది. ఈ సమయంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవడంతోపాటు మరణాలు సంఖ్య కూడా భారీగా పెరిగింది. ముఖ్యంగా ఆక్సిజన్ సిలిండర్లు అందరికీ అందుబాటులో లేకపోవడంతో మరణాలు ఎక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్ సరఫరాకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.
ఇదే సమయంలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీని కేంద్రం వేగవంతం చేసింది. దీంతో భారత్ లో ప్రస్తుతం కరోనా కట్టడిలో ఉంది. 2020లో కోవిడ్ మహమ్మారి గరిష్టస్థాయికి చేరుకున్నప్పుడు దేశంలో మరణాల రేటు 2.73శాతంగా ఉంది. మే 2021లో ఇది 1.33 శాతానికి పడిపోయింది.
మే 2022లో 1.04 శాతానికి కరోనా తీవ్రత తగ్గిందని భారత వైద్య ఆరోగ్యశాఖ నివేదికలు చెబుతున్నాయి. క్రమక్రమంగా తగ్గుతున్న కేసులు చూస్తుంటే.. దేశంలో కోవిడ్ తీవ్రత తగ్గుతోందని తెలుస్తోంది.