పోలీసుల‌ పై రెచ్చిపోయిన మ‌రో వైసీపీ నేత‌.. ఏం జ‌రిగిందంటే

Update: 2022-02-25 07:44 GMT
రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు.. దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. పోలీసు లు త‌మ మాటే వినాల‌ని.. లేక‌పోతే.. ఎదురుతిర‌గ‌డం ఖాయ‌మ‌ని వారు సంకేతాలు ఇస్తున్నారు. తమ ఆదేశాలను ధిక్కరించే పోలీసు అధికారులను మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎలా బెదిరిస్తున్నార‌నే  అంశాలు త‌ర‌చుగా మీడియాలో వార్తలుగా వస్తున్నాయి.

ఇటీవల విశాఖపట్నంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌పై మంత్రి సీదిరి అప్పలరాజు అసభ్య పదజాలంతో మాట్లాడిన ఘ‌ట‌న తెలిసిందే. శారదా పీఠం ఆశ్రమ ప్రాంగణంలోకి రానివ్వకుండా కాలర్‌తో పట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది మీడియాలో పెద్ద వార్తగా మారడంతో, పోలీసు అధికారుల సంఘం మంత్రి క్షమాపణలు కోరుతూ ప్రకటన విడుదల చేసింది.

మ‌రోవైపు గురువారం కృష్ణాజిల్లా వుయ్యూరు పట్టణంలో టీడీపీ కార్యకర్తలతో ఘర్షణ పడిన‌ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే. ఈ ఘ‌ట‌న‌పై  మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పోలీసులపై తీవ్ర పదజాలంతో దూషించారు.   తన పార్టీ కార్యకర్తలను కొట్టినందుకు వుయ్యూరు టౌన్ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ను పార్థసారథి దూషించిన‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

“మీరు నా అనుచరులను ఎలా అరెస్టు చేస్తారు. వారిని కొట్టడానికి మీకు ఎంత ధైర్యం? పోలీస్ స్టేషన్‌లో ప్రజలను కొట్టడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? నీకు ఆ అధికారం ఉందా?" అని కొలుసు విరుచుకుప‌డ్డారు. పెనమలూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నకొసులు త‌న కార్యకర్తలపై అసభ్యంగా ప్రవర్తించిన ఎస్‌ఐ, ఏఎస్‌ఐలపై క్రిమినల్ కేసులు పెట్టాలని పార్టీ నేతలను కోరారు.

‘‘పోలీసులు బ్రోకర్లలా ప్రవర్తిస్తున్నారు. అధికార పార్టీతో జోక్యం చేసుకోవద్దు’’ అని అన్నారు. పోలీసులపై ప్రతీకారం తీర్చుకునేందుకు తన పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పుతానని బెదిరించాడు. “మీరు నా అనుచరులను అసభ్యంగా ప్రవర్తిస్తే, మీపై దాడి చేయడానికి నేను వారిని రెచ్చగొడతాను.

ప్రతీకారంగా వారు మిమ్మల్ని కొడితే మీరు ఏమీ చేయలేరు. మేం అధికారంలో ఉన్నాం, మిమ్మల్ని కొట్ట‌డం మాకు కష్టం కాదు'' అని అన్నారు. మొత్తానికి అధికార పార్టీ నేత‌ల దూకుడు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News