రష్య ప్రెసిడెంట్ పుతిన్ నయా నియంతగా 2022 మొదట్లోనే తనను తాను ప్రపంచానికి పరిచయం చేసుకున్నారు. ఈ రకమైన సన్నివేశాన్ని తీసుకురావాలని పుతిన్ చాలా ఏళ్లుగా స్కెచ్ వేసుకున్నారని చెబుతారు. సోవియట్ యూనియన్ పతనం పుతిన్ కి నచ్చలేదని అంటారు. ఎంతో శక్తివంతమైన స్థితిలో అగ్రరాజ్యంగా వెలుగొందిన సోవియట్ యూనియన్ చిన్నాభిన్నం కావడాన్ని చూసిన పుతిన్ ఎప్పటికైనా రష్యా మళ్లీ ఆ స్థాయికి చేరాలని కలలు కన్నారు.
దాని కోసం ఆయన రెండవసారి ప్రెసిడెంట్ అయ్యాక యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. దాని ఫలితమే ఉక్రెయిన్ లోని క్రిమియా ద్వీపాన్ని ఆయన 2013లో మింగేయడం. నాడు కూడా ప్రపంచం ఇలాగే గర్జించింది. ఇది తప్పు అంది. కానీ రష్యా జోరు చేసి లాగేశాక మిన్నకుండిపోయింది. దాంతోనే వేయి ఏనుగుల బలం వచ్చినట్లుగా ఫీల్ అయిన పుతిన్ ఉక్రెయిన్ మీద కన్నేశారు. తన కత్తికి ఎదురులేదు, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలటరీ తనకు ఉందని గర్వించారు.
దాంతో తాను పెట్టుకున్న ముహూర్తం మేరకు ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ మీద విరుచుకుపడ్డారు. కేవలం రెండే రెండు రోజుల్లో ఉక్రెయిన్ ని స్వాధీనం చేసుకుంటామని ప్రగల్బాలూ పలికారు. ఆ మీదట తన కీలు బొమ్మ సర్కార్ ని ఏర్పాటు చేసి తానేంటో ప్రపంచానికి చూపించాలని భావించారు. తీరా చూస్తే సీన్ రివర్స్ అయింది. ఉక్రెయిన్ మీద పది రోజులుగా యుద్ధం చేస్తున్నా కూడా పట్టు చిక్కడంలేదు. పైగా ఉక్రెయిన్ సైనికులతో సరిసమానంగా పౌరులు కూడా ఫీల్డ్ లోకి వచ్చి రష్యా సైనికుల భరతం పడుతున్నారు.
ఈ దెబ్బకు రష్యాకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక అతి విశ్వాసంతో యుద్ధంలోకి దిగిన రష్యాకు అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాల ఆంక్షలతో రష్యాలో అన్నీ ఆర్ధిక సేవలూ బంద్ అయ్యాయి. అక్కడ ప్రజలు కట్టలు తెంచుకున్న కోపాన్ని పుతిన్ మీద చూపిస్తున్నారు. మరో వైపు యుద్ధం వద్దు అంటూ వీధుల్లోకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఆహార కొరత, ధరల పెరుగుదలతో పాటు, ఏటీఎం లలో నగదు కొరత. చేతిలో డబ్బులు లేక రష్యా జనాలు సమస్త పాపాలకూ పుతిన్ కారణమని మండిపోతున్నారు.
మరో వైపు రష్యా సైనికులు కూడా ఇలా ఉక్రెయిన్ వచ్చి అలా గెలిచేయవచ్చు అనుకున్నారు. కానీ ఉక్రెయిన్ లో యుద్ధం పది రోజులైనా ఎటూ తేలకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. వారికి ఉక్రెయిన్ జనాల నుంచి కూడా గట్టి దెబ్బలు తగులుతున్నాయి. దీంతో యుద్ధం వద్దు అని తమ అధినేత ఎపుడు చెబుతారా అని చూస్తున్నారు. వారిలో పోరాట పటిమ నానాటికీ తగ్గిపోతోంది.
ఈ పరిణామాలు ఇలా ఉండగా ఇంటా బయటా విమర్శలు, శాపనార్ధాలతో పుతిన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని అంటున్నారు. ఇంకో వైపు ఆయన్ని గద్దె నుంచి దించేందుకు కూడా తెర వెనక ప్రయత్నాలు మొదలైపోయాయని అంటున్నారు. రష్యాలోని బిలియనీర్లు అంతా కలసి పుతిన్ కుర్చీకి ఎసరు పెట్టడానికి చూస్తున్నారుట. ఉక్రెయిన్ ని జయించిన మీదట స్వీడన్, ఫిన్ ల్యాండ్ దేశాల మీద దాడి చేయాలి. వాటిని రష్యాలో కలుపుకుని పొవాలి. ఇదీ పుతిన్ పక్కా ప్లాన్.
ఇలా మాజీ సోవియట్ యూనియన్ దేశాలను అన్నింటినీ జయించి ప్రపంచ విజేత కావాలని చూసిన పుతిన్ కి ఇపుడు తన సీటు కిందకే నీళ్ళు వస్తున్నాయని అర్ధమపోతోందిట. అందుకే ఆయనలో అసహనం కట్టలు తెంచుకుంటోంది. అయినా చేసేది ఏమీ లేదు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ ని మాజీ చేద్దామని చూసిన పుతిన్ ఇపుడు మాజీ అయిపోయే సీన్ అయితే ఉందని అంటున్నారు. మరి రష్యాలో అంతర్యుద్ధం చెలరేగుతుందా. లేక కుట్ర జరుగుతుందా లేక మరో మార్గాన తొలగిస్తారా తెలియదు కానీ పుతిన్ తన టోటల్ పొలిటికల్ కెరీర్ లో ఎన్నడూ లేని ఘోర వైఫల్యాన్ని చవిచూస్తున్నాడు అని అంటున్నారు.