డొనాల్డ్ ట్రంప్. ఈ మాజీ అమెరికా అధ్యక్షుడు అధికారంలో ఉన్నప్పుడు మొండివాడిగా.. ధైర్యవంతుడిగా పేరొందాడు. యుద్ధంలోనూ.. ప్రపంచ దేశాలను భయపెట్టడంలోనూ.. అవసరమైతే ఉత్తరకొరియాలాంటి నియంతలతో సంధి చేసుకోవడంలో ముందున్నాడు. ట్రంప్ హయాంలో ‘యుద్ధాలు’ లాంటివి పెద్దగా జరగలేవు.
అయితే ట్రంప్ దిగిపోయి సౌమ్యుడైన జోబిడెన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. ఆయన అమెరికా భవిష్యత్తు దృష్ట్యా యుద్ధాలు వద్దని తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచపఠంపై అమెరికాను పలుచున చేస్తున్నాయి. ఉన్న ఫలంగా అప్ఘనిస్తాన్ ను ఖాళీ చేసి జోబిడెన్ అమెరికా పరువు తీశారన్న విమర్శ ఉంది. అప్ఘానిస్తాన్ క్రైసిస్ కు జోబిడెన్ కారణమని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా విమర్శించాడు.
ఇప్పుడు ఉక్రెయిన్ కు బాసటగా ఉంటామని.. నాటోలో చేర్చుకుంటామన్న అమెరికా, యూరప్ దేశాలు చివరకు రష్యా యుద్ధానికి దిగితే ఉక్రెయిన్ ను వదిలేసి నట్టేటా ముంచాయి. అమెరికా అధ్యక్షుడు, నాయకత్వానికి ఉక్రెయిన్ యుద్ధం మాయని మచ్చగా మారింది. ఆపదలో సాయం చేయలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వాపోయడంతో అమెరికా పరువు గంగపాలైంది.
ఈ క్రమంలోనే ఉక్రెయిన్ లో రష్యా సైనిక దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓసారి పుతిన్ ను పొగుడుతూనే మరోసారి రష్యాను తిడుతూ వ్యాఖ్యలు చేసి ట్రంప్ దుమారం రేపారు.
తాజాగా ఉక్రెయిన్-రష్యా వార్ జరుగుతున్న వేళ తదుపరి దండయాత్ర తైవాన్ పైనే అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన ట్రంప్.. తదుపరి దాడి తైవాన్ పైనే జరిగే అవకాశం ఉందని బాంబు పేల్చారు. దీనికోసం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జిన్ పింగ్ ఎంతో తెలివైన వ్యక్తి అని.. అప్ఘనిస్తాన్ ను అమెరికా ఎలా వీడిందో గమనించారని.. అందుకే అప్ఘనిస్తాన్ దృష్ట్యా అమెరికా ఎదుర్కొన్న అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని పరోక్షంగా జిన్ పింగ్ ను హెచ్చరించారు.
ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పై మండిపడ్డారు. అగ్రరాజ్యం అమెరికా మూర్ఖంగా వ్యవహరిస్తోందని.. అందుకే తమ నాయకులను ప్రపంచదేశాల నేతలు అసమర్థులుగా చూస్తున్నారని విమర్శించారు. అందుకే అమెరికా అంటే భయం లేకుండా యుద్ధాలకు దిగుతున్నారని ఆరోపించారు. తైవాన్ దాడి అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరో యుద్ధం ఖాయం అన్న భయాలు నెలకొన్నాయి.