అదిగో థర్డ్ వేవ్.. ఇదిగో థర్డ్ వేవ్ అంటూ వినిపించిన మాటలతో దేశీయంగా ప్రజలు ఎంతలా వణికారో తెలిసిందే. చూస్తుండగానే క్యాలెండర్ లో ఆగస్టు వెళ్లిపోయింది.. దానితో పాటు సెప్టెంబరు ముగిసింది. అక్టోబరు వచ్చింది. అయితే.. సెప్టెంబరు నుంచి అక్టోబరు మధ్యలో ఒక నెల పాటు కరోనా థర్డ్ వేవ్ కమ్మేస్తుందన్న అంచనాలకు భిన్నంగా తాజా పరిస్థితి ఉంది. ఇలాంటివేళ.. తాజాగా శాస్త్రవేత్తలు పలువురు దేశీయంగా థర్డ్ వేవ్ కు సంబంధించి తాజా వార్నింగ్ ను ఇచ్చేశారు.
వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు.. సందీప్ మండల్.. నిమలన్ అరినమిన్ పతి.. బలరాం భార్గవ.. శమిరణ్ పాండాలు రాసిన అధ్యయన పత్రంలో తాజాగా కరోనా థర్డ్ వేవ్ గురించి వివరంగా వెల్లడించారు. దీని ప్రకారం కరోనా మూడో వేవ్ ఉందని.. దాని తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. ఈ నెలలో కేసుల నమోదు ఎక్కువై.. వచ్చే జనవరి - ఏప్రిల్ మధ్య తీవ్రస్థాయికి చేరుకునే వీలుందన్న అంచనాల్ని వినిపిస్తున్నారు.
జర్నల్ ఆఫ్ ట్రావెల్ మెడిసిన్ లో ప్రచురితమైన అధ్యయనపత్రంలో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. పర్యాటకుల సంఖ్య పెరగటం.. సామాజిక.. రాజకీయ.. మతపరమైన అంశాలతో ప్రజలు పెద్ద ఎత్తున గుమి గూడుతున్నారని.. ఇవన్నీ మూడో వేవ్ కు కారణాలుగా చెబుతున్నారు. ఇటీవల పర్యాటకుల తాకిడి పెరిగిన తర్వాత హిమాచల్ ప్రదేశ్ .. మనాలి.. పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ లలో కేసులు పెరుగుతున్న వైనాన్ని వారు ఉదాహరణగా చెబుతున్నారు.
తాజాగా పబ్లిష్ అయిన అధ్యయనపత్రంలో పేర్కొన్న అంశాల్ని చూస్తే..
- దేశీయంగా పర్యాటకం పెరిగితే వ్యాపారులకు.. స్థానికులకు మంచి జరుగుతుంది. కానీ.. పర్యాటకులు.. స్థానికులు.. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- హోటళ్లలో.. కేఫ్ లలో ఎక్కువసేపు మాట్లాడుకోవటం.. షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవటం.. లాంటివి కారణంగా మూడో ముప్పు అధికమయ్యే అవకాశం ఉంది.
- కొవిడ్ ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేసినా.. పర్యాటకుల తాకిడి లేకుంటే మూడో వేవ్ తీవ్రత కొంతమేర తగ్గే వీలుంది. సెలవు రోజుల్లో పర్యాటకుల సంఖ్య పెరిగితే మాత్రం మహమ్మారి సులువుగా వ్యాపించే వీలుంది.
- దేశంలో జనసాంద్రతఎక్కువ. కాబట్టి మూడో వేవ్ కొన్ని ప్రాంతాల్లో రోజువారీ కేసుల పెరుగుదల 103 శాతం ఉండొచ్చు.
- రాష్ట్రాల్లో ఆంక్షల్ని సింపుల్ ఫై చేస్తే.. మూడో వేవ్ వెను వెంటనే పెరుగుతుంది.