బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయబోతున్నారా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీహార్ సీఎం పదవి తమకు కూడా కావాల్సిందే అని బీజేపీ ఎంఎల్ఏల డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే నితీష్ మీడియాతో మాట్లాడుతూ తాను రాజ్యసభకు వెళ్ళటానికి రెడీ అవుతున్నట్లు చెప్పటం కలకలం రేపుతోంది.
ఒకవైపు సీఎం కుర్చీకోసం బీజేపీ డిమాండ్లు ఇదే సమయంలో రాజ్యసభకు వెళ్ళటంపై నితీష్ ప్రకటనను గమనిస్తే తొందరలోనే నితీష్ రాజీనామా చేయక తప్పదనే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే సంకీర్ణ ధర్మం పేరుతో 2020 ఎన్నికల్లో బీజేపీ నితీష్ నే సీఎంగా చేసింది. నిజానికి ఆ ఎన్నికల్లో నితీష్ పార్టీ జేడీయూకి 43 సీట్లు, బీజేపీ 74 సీట్లను గెలుచుకున్నాయి. అందుకే అప్పట్లోనే బీజేపీకి సీఎం కుర్చీ అంటు డిమాండ్లు వినిపించాయి.
అయితే బీజేపీ అగ్రనేతలు మాత్రం సంకీర్ణ ధర్మం పేరుతో నితీష్ నే సీఎం చేశారు. అప్పటి నుండి బీజేపీలో అసంతృప్తి పెరిగిపోతోంది. ఏదో రూపంలో నితీష్ ను బీజేపీ మంత్రులు, ఎంఎల్ఏలు, స్ధానిక నేతలు ఇబ్బందులు పెడుతునే ఉన్నారు. ఒక దశలో బీజేపీతో నితీష్ కటీఫ్ చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. అయితే తర్వాత పరిస్థితులు సర్దుకున్నాయి. కానీ మళ్ళీ అలాంటి సమస్యలే నితీష్ ను చుట్టుముడుతున్నాయి.
ఈ మధ్యనే వికాస్ శీల్ ఇన్సాఫ్ (వీఐపీ)పార్టీకి చెందిన ముగ్గురు ఎంఎల్ఏలు బీజేపీలో చేరారు. అప్పటినుండి బీజేపీకి ముఖ్యమంత్రి పదవి దక్కాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఇదంతా బీజేపీ నేతలే వెనుకనుండి చేయిస్తున్నట్లు నితీష్ అనుమానిస్తున్నారు. బీజేపీ నేతలతో నెట్టుకురావటం ఇబ్బందిగా ఉన్నట్లుంది. అందుకనే తాజాగా మీడియాతో మాట్లాడుతు రాజ్యసభకు వెళ్ళాలనే కోరికను బయటపెట్టారు. బహుశా నితీష్ రాజ్యసభకు వెళితే కేంద్రమంత్రి అయిపోతారేమో చూడాలి.