ఐపీఎల్ 2020లో వెనకబడ్డ సీఎస్‌కే జట్టు.. ఐపీఎల్ 2021 లో మాత్రం దూసుకుపోతున్నది. వరస విజయాలతో ఫ్యాన్స్ ను అలరిస్తోంది. ధోనీ కూల్ కెప్టెన్సీ తోడై సీఎస్‌కే జట్టు వరస విజయాలను నమోదుచేస్తున్నది. నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సీఎస్‌కే గెలుపొందిన విషయం తెలిసిందే. సీఎస్‌కే 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో రన్ అవుట్ కాకుండా ధోనీ చేసిన డైవ్ అందరినీ ఆకట్టుకున్నది.అంతేకాక ఆర్ ఆర్ బ్యాట్స్‌మెన్ లను కట్టడి చేసేందుకు ధోనీ పకడ్బందీగా బౌలింగ్ చేయించడం కలిసి వచ్చింది. దీంతో ప్రస్తుతం సీఎస్‌కే జట్టుకు ప్రశంసలు దక్కుతున్నాయి.
ఇదిలా ఉంటే ధోనీ ఆటతీరుపై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం లారా స్పందించారు. తనదైన స్టయిల్లో కామెంట్లు చేశారు. ఈ టైంలో ధోనీ నుంచి ఎక్కువ పరుగులు ఆశించలేమని.. అతడు విశ్రాంతి తీసుకొని యువకులకు అవకాశం ఇవ్వాలని లారా అభిప్రాయపడ్డాడు.ప్రస్తుతం సీఎస్‌కే బ్యాట్స్మెన్లు ఫామ్ లో ఉన్నారు. అందువల్ల వాళ్లు ధోనీకి విశ్రాంతి ఇవ్వాలి. నిన్నటి మ్యాచ్ లో మొయిన్ అలీ మెప్పించాడు. జడేజా, డుప్లెసిస్, రాయుడు, బ్రావో కూడా రాణించారు.
'ధోని పరుగులు చేయడం లేదని.. కొందరు సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇది సరికాదు. ఎందుకంటే ధోనీ ప్రస్తుతం కీపర్‌గా, కెప్టెన్ గా ఎంతో రాణిస్తున్నాడు. అతడిపై అంతకు మించిన అంచనాలు సరికావు. ధోనీ కనక ఒక్కసారి క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడంటే.. ఎంతటి విధ్వంసమైనా చేయగలడు. కానీ అతడు ప్రస్తుతం కెప్టెన్సీపై దృష్టి సారించాలి. ప్రస్తుతం సీఎస్‌కే జట్టు పరిపూర్ణంగా కనిపిస్తోంది' అని లారా పేర్కొన్నాడు.ప్రస్తుతం సీఎస్‌కే జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.