కొలీజియంపై కామెంట్స్ చేసిన కేంద్ర న్యాయశాఖ మంత్రి!

Update: 2022-10-20 00:30 GMT
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ‘కొలీజియం’ విధానంలో న్యాయమూర్తుల నియామకం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని తనకు తెలుసునని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సంచలన కామెంట్స్ చేశారు. భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం న్యాయమూర్తుల నియామకం బాధ్యత ప్రభుత్వానిది అని తెలిపారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రచురిస్తున్న వారపత్రిక ‘పాంచజన్య’ నిర్వహించిన ‘సబర్మతి సంవాద్’లో ఆయన మాట్లాడారు. న్యాయమూర్తుల సమయంలో దాదాపు సగం వరకూ జడ్జీల నియామకంపై నిర్ణయం తీసుకోవడానికే ఖర్చవుతోందని..దీనివల్ల న్యాయం అందజేయడమనే న్యాయమూర్తుల ప్రధానవిధికి విఘాతం కలుగుతోందని చెప్పారు.

1993 వరకూ న్యాయమూర్తుల నియామకం కోసం అనుసరించిన విధానం వేరేగా ఉండేది. చీఫ్ జస్టిస్ , కేంద్ర న్యాయశాఖ న్యాయమూర్తులను నియమించేది. ప్రతీ న్యాయమూర్తి నియామకం ఆ విధంగానే జరిగేది. రాజ్యాంగంలోనూ సుస్పష్టంగా ఉంది. రాష్ట్రపతి నియమించాలి. న్యాయవ్యవస్థ కొలీజియం 1998లో విస్తరించిందని కిరణ్ తెలిపారు.

చీఫ్ జస్టిస్ కొలీజియానికి నేతృత్వం వహిస్తారని.. నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జీలు ఈ కొలీజియంలో ఉంటారని.. కొలీజియం చేసే సిఫారసులపై ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తవచ్చని తెలిపారు. లేదా వివరణ కోరవచ్చన్నారు. ఈ కొలీజియం తన సిఫారసులను పునరుద్ఘాటిస్తే ఆ సిఫారసులను అమలు చేయకతప్పదన్నారు.

న్యాయమూర్తులు తమ సోదరులు న్యాయమూర్తులుగా నియమించుకునే సంప్రదాయం ప్రపంచంలో మరెక్కడా లేదని కిరణ్ రిజిజు అన్నారు. న్యాయశాఖ మంత్రిగా నేను గమనించిన మరో అంశం న్యాయమూర్తుల ప్రధాన పని న్యాయాన్ని అందజేయడం కాగా.. వారు తమ తదుపరి న్యాయమూర్తుల నియామకం గురించే ఆలోచించడానికి సమయం సగం కేటాయిస్తున్నారంటూ’ కిరణ్ రిజిజు ఈ సంచలన కామెంట్స్ చేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News