మారుతీ రావు సూసైడ్ ఫై లాయర్ కామెంట్స్

Update: 2020-03-09 14:19 GMT
మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతిరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తన లాయర్ ను కలవడానికి హైదరాబాద్ వచ్చిన మారుతీరావు ఖైరతాబాద్‌లోని వైశ్యభవన్‌లో విషం తాగి ఆత్మహ త్య చేసుకున్నారు. మారుతిరావు బసచేసిన గదిలో సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. సోమవారం నాడు మారుతీరావు అంత్యక్రియలు మిర్యాలగూడలో పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మారుతీరావు ఆత్మహత్యపై మారుతీరావు వ్యక్తిగత న్యాయవాది వెంకట సుబ్బారెడ్డి స్పందించారు. మారుతి రావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని లాయర్‌ వెంకట సుబ్బారెడ్డి అన్నారు. తనను కలిసేందుకే మారుతిరావు హైదరాబాద్‌ వచ్చిన మాట వాస్తవమేనని సుబ్బారెడ్డి అన్నారు.

శనివారం రాత్రి 8.30 గంటలకు మారుతీరావు తనతో మాట్లాడారని, కేసు గురించి చర్చించామని చెప్పారు. కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముందుకు రావడంతో మారుతి రావు తీవ్రంగా ఆందోళనకు గురయ్యారని అన్నారు. ఈ కేసు విచారణను వాయిదా వేయించేందుకు మారుతీరావు ప్రయత్నించారని తెలిపారు. ప్రణయ్ ఎస్సీ కాదని నిరూపించేందుకు కొన్ని సాక్ష్యాలు తనకు ఇచ్చారని సుబ్బారెడ్డి తెలిపారు. ఎస్సీ - ఎస్టీ కేసుపై మంగళవారం హైకోర్టులో కేసు వేయాలని చర్చించుకున్నామని, ఈలోపై ఇలా జరిగిందని అన్నారు. ఆస్తి పంపకాల  వ్యవహారంపై తనతో ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. ప్రణయ్ హత్య కేసులో శిక్ష పడుతుందన్న భయంతో మారుతీరావు సూసైడ్ చేసుకొని ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. మారుతిరావుతో తనకు ఏడేళ్ల పరిచయం ఉందని, ఆయన భార్య గిరిజ తనతో బాగా మాట్లేడదని సుబ్బారెడ్డి పేర్కొన్నారు



Tags:    

Similar News